జగన్ సర్కార్‌ కు షాక్.. దిశ బిల్లు వెనక్కు పంపిన కేంద్రం..

మండలి రద్దు తీర్మానంతో మంచి హుషారుగా ఉన్న ఏపీ జగన్ సర్కార్ కు కేంద్ర సర్కార్ ఝలక్ ఇచ్చింది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కు పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేయాలని సూచించింది. ఈ దిశ బిల్లులో పొందుపరచిన 7వ షెడ్యూల్‌లో ఎంట్రీలు సరిగాలేవని.. వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఏపీ అసెంబ్లీకి వచ్చిన బిల్లు అక్కడ నుంచి ప్రభుత్వానికి చేరింది. కేంద్రం చెప్పిన సవరణల్ని సరిచేసే పనిలో ఉన్నారు అధికారులు. కేంద్రం నుంచి ఏపీ అసెంబ్లీకి బిల్లు రాగా, అక్కడి నుంచి ప్రభుత్వానికి చేరింది. కేంద్రం సూచనలకు అనుగుణంగా సాంకేతిక అంశాలను సరిచేసి, మళ్లీ త్వరలోనే బిల్లును కేంద్రానికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లనుంది. ఆయన కూడా ఆమోదించాక తర్వాత చట్ట రూపంలో దిశ యాక్ట్ అమల్లోకి వస్తుంది.

Image result for jagan

ఇదిలా ఉంటే దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం తన కసరత్తును ముమ్మరం చేసింది. దిశ పోలీస్ స్టేషన్‌లు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం సచివాలయంలో సంబంధిత శాఖాధికారులతో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ 7న దిశ పోలీస్‌స్టేషన్‌, వన్‌స్టాప్ సెంటర్‌ను ముఖ్యమంత్రి జగన్‌ చేతులు మీదుగా ప్రారంభంకానున్నాయి. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో దిశ స్పెషల్ యాప్‌ను, స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్‌నూ(ఎస్ఓపీ) ప్రారంభించనున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక దిశా చట్టంలోని కొన్ని ముఖ్య విషయాలను పరిశీలిస్తే.. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నిర్భయ చట్టంప్రకారం అత్యాచార దోషులకు జీవిత ఖైదు లేదా మరణదండనను శిక్షగా విధిస్తారు. దిశా చట్టం ప్రకారం రేప్‌ చేసినవారికి తప్పనిసరిగా మరణదండన విధిస్తారు. నిర్భయ చట్టం ప్రకారం 2 నెలల్లో దర్యాప్తు పూర్తి, మరో 2 నెలల్లో శిక్షలు అమలు చేయాలి. దిశ చట్టం ప్రకారం వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తి కావాలి. 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. పక్కా ఆధారాలు(కంక్లూజివ్‌ ఎవిడెన్స్‌) లభించినట్లయితే 21 రోజుల్లోపే దోషికి ఉరి శిక్ష పడాలి. అత్యాచార నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు దర్యాప్తు 7 రోజుల్లో చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తి చేసేలా దిశ చట్టంలో చేర్చారు. ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్రప్రభుత్వం చట్టంలో ఉన్న 6 నెలల కాలాన్ని రాష్ట్ర పరిధిలో కేవలం 3 నెలలకు కుదించారు. ఇలా ఆడపిల్లల పట్ల ఎవరు తప్పు చేసిన వారికీ కఠిన శిక్ష పడుతుంది. ఈ బిల్లు తొందర్లోనే ఆమోదం పొందేలా అధికారులు సవరణలు చేసి కేంద్రానికి పంపనున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation