జగన్‌కు కేంద్రం గుడ్‌న్యూస్ టీడీపీ నేత‌ల‌కు మ‌రో షాక్

65

ఇటీవల హ‌స్తిన వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌కు క‌లిసిన సీఎం జ‌గ‌న్ కు కేంద్రం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది..
ప‌లు విష‌యాలపై బీజేపీ పెద్ద‌లను క‌లిసిన సీఎం జ‌గ‌న్ వాటికి గ్రీన్ సిగ్న‌ల్ ఇప్పించుకున్నారు
శాస‌న‌మండ‌లి ర‌ద్దు అంశ‌మే కాదు మూడు రాజ‌ధానుల విష‌యంతో పాటు స్టీఫెన్ ర‌వీంద్ర కోసం ప‌ట్టుప‌ట్టార‌ట సీఎం జ‌గ‌న్2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఇంటిలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావించారట. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో చర్చించగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవీంద్రను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. డిప్యుటేషన్‌పై ఏపీకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు.

స్టీఫెన్ రవీంద్ర అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. దీంతో ఏపీకి రావడం ఖాయమని అందరూ భావించారు. కానీ కేంద్రం నుంచి అప్పుడు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. దీంతో కుమార్ విశ్వజిత్‌కు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనే నిఘా విభాగం బాధ్యతల్ని చూసుకున్నారు.డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఇంటిలిజెన్స్ చీఫ్‌‌ను నియమించింది. ఏపీఎస్ అధికారి మనీష్‌కుమార్ సిన్హాకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్ స్థానంలో సిన్హాను నియమించారు.. మనీష్ కుమార్ 2000 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయనే ఇంటిలిజెన్స్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర.. సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయనకు ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. రాయలసీమలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వత ఆయన తెలంగాణకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ రేంజ్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తెలంగాణలో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇంఛార్జ్‌‌గా ఉన్నారు. ఇక తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆయ‌న తెలంగాణ నుంచి రిలీవ్ అయి, ఇక పూర్తిస్ధాయిలో ఏపీలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా ప‌ద‌వి నిర్వ‌హ‌ణ చేప‌ట్ట‌నున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation