లాక్ డౌన్ పొడిగింపు.. మోడీ మరో సంచలన నిర్ణయం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో కూడా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం 4 వందల పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.అయితే ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను కూడా ప్రకటించింది.దేశవ్యాప్తంగా మొత్తం 72 జిల్లాలలో కూడా ఈ నెల 31 వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ ని ప్రకటించారు.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

Image result for modi

అయితే ఈ లాక్ డౌన్ కి కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఏమాత్రం సహకరించకపోవడం తో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు,పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ని ప్రకటించాయి.కానీ ఈ లాక్ డౌన్ కి ప్రజలు ఏమాత్రం సహకరించడం లేదు.ఎలాంటి పని లేకపోయినా ఎదో ఒక వంకతో బయటకు వస్తుండడం,చుట్టాల ఇళ్లకు వెళ్తుండడం వంటి చర్యలతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తుంది.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

కరోనా ను నియంత్రించడానికి కేంద్రం ఈ లాక్ డౌన్ పీరియడ్ ను పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈనెల 31 వరకు అమలు కానున్న ఈ లాక్ డౌన్ పిరియడ్ మరో 10 రోజులు పొడిగించి ఏప్రిల్ 10 వరకు కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఏ చిన్న తేడా వచ్చినా సరే పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది.కాబట్టి ఇప్పుడు ప్రజలను పూర్తిగా కట్టడి చేయడానికి గాను ఎమర్జెన్సి ని ప్రకటించే యోచనలో మోడీ సర్కార్ ఉంది.ప్రజలు బయటకు వస్తే లాఠీ చార్జ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.మాట వినకపోతే మాత్రం అరెస్ట్ చేయడానికి జైల్లో పెట్టడానికి సిద్దమవుతుంది.అవసరం అనుకుంటే దీనిపై ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.

Content above bottom navigation