ఏపీలో ఒక్క కాల్‌ తో ఇంటి వద్దకే సరుకులు.. ఫోన్ నంబర్లు ఇవే..

212

దేశం మొత్తం లాక్ డౌన్ అయిన నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విజయవాడ నగర కమిషనర్ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు వచ్చే విధంగా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చర్యలు చేపట్టారు. ప్రజలు వారి ఇంటి నుంచే ఫోన్ ద్వారా తమకు అవసరమైన నిత్యావసర వస్తువులు చెబితే.. ఇంటి వద్దకే సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఎంఆర్‌పీ ధరలకే ఇంటి వద్దకు నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, ఇంటి నుంచి బయటకు రాకుండా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు.

ఏపీలో ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి వద్దకే సరుకులు... ఫోన్ నంబర్లు ఇవే...?
అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమించి ఎంఆర్‌పీ ధరలకు మంచి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇదే విధానాన్ని రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలు పట్టణాల్లో డోర్ డెలివరీ విధానాన్ని శ్రీకాకుళం వంటి కొన్ని పట్టణాల్లో ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలు సమయంలో ప్రజలు ఒకరి నుంచి మరొకరు వీలైనంత సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రతి షాపులోనూ, రైతు బజార్లలోనూ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే నిత్యావసర వస్తువుల వాహనాలకు ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతి ఉంటేనే జిల్లాలోకి అనుమతిస్తామని చెప్పారు. రైతు బజార్లు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచి ఉంటాయని, పెట్రోల్ బంకుల్లో ఉదయం11 గంటల వరకూ విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. తహసీల్దార్లతో జేసీ వెంకట్రామిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఈ నెల 29న రేషన్ సరుకుల పంపిణీకి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

వైద్య, ఆరోగ్యశాఖాధికారులతోనూ, డిస్ట్రిక్ రెస్పాన్స్ టీమ్తోనూ జేసీ-2 తేజ్ భరత్ సమావేశం అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులకు గైర్హాజరు కావొద్దని వైద్య ఆరోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబరుకు చెప్పాలని జిల్లా వాసులకు జేసీ -2 సూచించారు. ఏలూరులో తెరిచి వున్న షాపులను మూయించిన కలెక్టర్ ముత్యాలరాజు జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వస్తున్న జనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారన్నారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హెచ్చరించారు.

Content above bottom navigation