ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… విద్యుత్ బిల్లులు అంత చెల్లిస్తే చాలు

122

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటివరకూ 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 111 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ మూడు వారాల పాటు దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. దాంతో ఎక్కడి వ్యవస్థ అక్కడే ఆగిపోయింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పూర్తీగా దెబ్బతింది. జనాలు అందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక కరోనా నేపథ్యంలో ఏపీ ప్రజలకు అక్కడ విద్యుత్ శాఖ శుభవార్త తెలిపింది.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

YS Jagan Mohan Reddy announces lockdown of Andhra Pradesh till ...

విద్యుత్‌ వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస్కం పరిధిలోని వినియోగదారులు ఫిబ్రవరి నెలలో ఎంత బిల్లు చెల్లించారో అదే మొత్తాన్ని మార్చి నెలకూ చెల్లిస్తే సరిపోతుందని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మ జనార్దనరెడ్డి మీడియాకు తెలిపారు. ఒకవేళ విద్యుత్‌ వినియోగంలో హెచ్చు తగ్గులుంటే వచ్చే నెలలో ఆ మేరకు సర్దుబాటు చేస్తామని వివరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్‌తో అంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా 24 గంటల్లో కరెంట్ అందిస్తున్నారు. దీంతో ఇంట్లోనే ఉండేవాళ్లు.. సినిమాలు చూస్తే కాలక్షేపం చేస్తున్నారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

విద్యుత్‌ కు సంబంధించిన సమస్యలుంటే 1912 నెంబరు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మ జనార్దన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిలోనే ఉంటూ సహకరిస్తున్న విద్యుత్‌ వినియోగదారులకు, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు సహకరిస్తున్న ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించే వరకు ఇదే సహకారాన్ని అందించాలని, ప్రజలందరికి ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై సురక్షితంగా ఉండాలన్నారు. మరోవైపు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారని సమాచారం. నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు… వాహనాలను సీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Content above bottom navigation