ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ..

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం రాత్రి లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి పలు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక రథచక్రాన్ని పరుగులు పెట్టించాల్సిన అవసరం లేకపోయినా, కనీస వేగంతోనైనా నడపాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

Evaluating 100 days of Y.S. Jagan Mohan Reddy's rule - The Hindu
సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

మంగళవారంతో లాక్డౌన్ గడువు ముగుస్తున్నందున దేశాన్ని మూడు జోన్లుగా విభజించి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ప్రతిపాదించారు. కోవిడ్– 19 నివారణా చర్యల్లో భాగంగా రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించి ఆ మేరకు నియంత్రణ చర్యలను చేపట్టాలని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా హృదయపూర్వకంగా మద్దతు తెలుపుతానని సీఎం జగన్ స్పష్టం చేశారు.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

అలాగే వివిధ రంగాలపై లాక్డౌన్ ప్రభావాన్ని ప్రధాని మోదీకి సీఎం జగన్ నివేదించారు. రాష్ట్రంలో డిమాండ్, సరఫరా చైన్కు తీవ్ర ఆటంకం కలిగిందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జీఎస్డీపీలో 34 శాతం వ్యవసాయ రంగానిదేనని.. లాక్ డౌన్ కారణంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్, రవాణాకు తీవ్ర అవాంతరాలు ఏర్పడ్డాయని జగన్ లేఖలో తెలిపారు. ఆయా రంగాలపై ఆధారపడి ఉన్నవారి జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించాయి. ఆక్వా ఎగుమతులకు ఆయా దేశాల్లో మార్కెట్లు తెరుచుకునేలా కేంద్ర వాణిజ్య శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని గోదాములు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నందున వీలైనంత వరకు ఖాళీ అయ్యేలా చూడాలన్నారు.అలాగే ఓ వైపు ప్యాక్టరీలు నడవకుండా మరోవైపు వాటి ఫిక్స్డ్ ఖర్చులు తగ్గకుండా జీతాలు, వేతనాలు ఏ విధంగా చెల్లిస్తాయని సీఎం జగన్ అన్నారు. రవాణా కూడా పూర్తి స్ధాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల, సిమెంటు, స్టీలు లాంటి రంగాలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

Content above bottom navigation