ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకూ కొనసాగనుంది. అయితే ఏపీలో తాజాగా కరోనా బాధితులందరినీ పరీక్షించిన ప్రభుత్వం, ఇంకా మిగిలిన వారికీ రెండ్రోజుల్లో పరీక్షలు నిర్వహించనుంది. ఇంకా ఎవరికైనా కరోనా సోకిందేమోనన్న అనుమానాలతో ర్యాండమ్ టెస్టులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ లెక్కల మూడు రోజుల్లో రాష్ట్ర్లంలో కరోనా పరిస్ధితిపై క్లారిటీ వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ విషయంలో పునరాలోచన చేస్తోంది. మరి సీఎం జగన్ ఏం ఆలోచన చేస్తున్నారు అనేది చూస్తే ?