హైదరాబాద్ ప్రజలకి గుడ్ న్యూస్ ఇక వారు కనబడరు

భారతదేశం …ప్రపంచపటంలో మన ఈ దేశానికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ఆచార వ్యవహారాలకు కట్టుబాట్లకు ప్రపంచం మొత్తం దాసోహం అంటుంది. కానీ దేశంలో కటిక పేదరికంలో బ్రతికేవారు కూడా లక్షల్లో ఉన్నారు. అన్నపూర్ణగా పిలిచే దేశంలో పట్టెడు అన్నం కోసం దేహి అంటూ యాచించే వారు చాలామంది ఉన్నారు. రోజురోజుకి ఇలాంటివారు దేశంలో పెరిగిపోతున్నారు. దీనితో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలో ఏ కూడలి వద్ద చూసినా యాచకులు కనిపిస్తుంటారు. ఇక ఈ యాచన వృత్తికి స్వస్తి చెప్పి వారికి ఏదో ఒక రకంగా పునరావాసం ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది . ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ అమలుకు హైదరాబాద్ ను ఎంచుకుంది కేంద్రం. హైదరాబాద్ లో రద్దీగా ఉండే సిగ్నల్స్ దగ్గర దేవాలయాలదగ్గర ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద విపరీతంగా యాచకులు కనిపిస్తుంటారు.

Image result for kcr speech

బెగ్గర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేలా జీహెచ్ఎంసీ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకుగాను బిక్షగాళ్ల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఏడు అంశాలను తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

  1. పోలీస్ ఎన్జీవీవో కమ్యూనిటీ ఇతర ఏజెన్సీల సహకారంతో సర్వే చేసి యాచకులను గుర్తించడం
  2. యాచకులను కేటగిరీల వారీగా.. పిల్లలు మానసిక వ్యాధిగ్రస్తులు సీనియర్ సిటిజెన్స్ దివ్యాంగులు అనాథలు కుటుంబాలున్నవారు పనిచేయగల వ్యక్తులుగా విభజించడం
  3. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించడం
  4. కేటగిరీల వారీగా అందరికీ కౌన్సిలింగ్ నిర్వహణ
  5. మానసిక వ్యాధిగ్రస్థులకు ఉచిత భోజన వసతి కల్పించుట
  6. యాచకులందరికీ సమగ్ర పునరావాసం
  7. ఈ కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేసేందుకు నిధుల సమీకరణ.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ కార్యచరణను పక్కాగా అమలు పరిచేందుకు కార్పొరేటర్లు పోలీస్ శాఖ రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులు ఐసీడీఎస్ ఉద్యోగులు ముఖ్యంగా ఎన్జీవోలు సంక్షేమ శాఖల ప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేర్చాలని జీహెచ్ ఎంసీ అధికారులు నిర్ణయించారు. అయితే హైదరాబాద్ వంటి మహా నగరంలో బెగ్గింగ్ అనేది ఇప్పుడు ఒక మాఫియాగా మారింది. ఇటువంటి సమయంలో బెగ్గింగ్ గ్యాంగ్ లు కట్టడి అవుతాయి అనే చెప్పాలి, మరి చూడాలి ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation