దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. అయితే గతంలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 2వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ లో ఐదు వందల కేసులు నమోదు కాగా మూడో తేదీన 391 కేసులు నమోదయ్యాయి. నిన్న గ్రేటర్ పరిధిలో 532 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఈరోజు ఉదయం వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జులై నెలలో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో కలిపి 1095 కేసులు నమోదు కాగా సోమ, మంగళవారాల్లో 664 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గ్రేటర్ లో నమోదవుతున్న కేసుల సంఖ్యలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహిస్తున్న రాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో సగటున 17 శాతం వరకు పాజిటివ్ నిర్ధారణ అవుతున్నాయి.