బాలికను కాపాడిన దిశ యాప్ 10నిమిషాల్లోనే అరెస్టు

116

ఏపీలో మహిళల రక్షణ కోసం తీసుకువచ్చింది దిశ యాప్, దీనిని ప్రతీ ఒక్కరు ఆపదలో ఉపయోగించుకోవాలి అని పోలీసులు కూడా చెబుతున్నారు, ఇప్పుడు మహిళలు అందరి మొబైల్స్ లో దిశ యాప్ అందుబాటులో ఉంది. మహిళా జాతి రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ యాప్ చాలా తక్కువ సమయంలో అందరికి రీచ్ అయింది.. మారు మూల గ్రామాల్లోనూ ఏ అఘాయిత్యం జరగకుండా కాపాడగలుగుతుంది. ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై ఓ పోకిరి వేధింపులు చేస్తే ఆమె దిశ యాప్ లో కంప్లైంట్ ఇచ్చిన 10 నిమిషాల్లో అలర్ట్ అయ్యారు, అలాగే మరో ఘటన తాజాగా అనంతపురం జిల్లాలో జరిగింది.ఓ బాలికను అర్ధరాత్రి కాపాడారు పోలీసులు. నిందితుడిని 10నిమిషాల్లో అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. . శనివారం రాత్రి గుమ్మఘట్ట మండలంలోని 75 వీరాపురం తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్‌ జయంతోత్సవాలు జరిగాయి. స్థానికులంతా ఉత్సవంలో పాల్గొన్నారు. 16 ఏళ్ల బాలికకు నిద్ర వస్తుందని రాత్రి 12:45 నిమిషాలకు పక్క వీధిలోనే ఇంటికి వెళ్లేందుకు బయల్దేరింది.

Image result for disha app

ఆమెపై ముందునుంచి కన్నేసిన తిరుపాల్‌నాయక్‌ అనే యువకుని వెంబడించాడు. కోరిక తీర్చాలంటూ చెయ్యి పట్టుకోవడంతో చెంప మీద కొట్టి గట్టిగా కేకలు పెట్టింది ఆ అమ్మాయి… తక్షణ సాయం కోసం దిశ యాప్‌ కు మెసేజ్‌ చేసింది. ఆ లోపు అటువైపుగా వెళ్తున్న బాలిక బాబాయి ఘటనను గమనించి అక్కడికి చేరుకునేలోగా యువకుడు పరారయ్యాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

సమాచారం అందుకున్న విజయవాడ దిశ కంట్రోల్‌ రూమ్‌.. జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియచేయడంతో రాయదుర్గం రూరల్‌ సీఐ పి.రాజ, ఎస్‌ఐ తిప్పయ్యనాయక్‌లను ఎస్పీ అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఇంట్లో దాక్కున్న తిరుపాల్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు, చూశారుగా అమ్మాయిలని ఏడిపించినా వెంబడించినా వారికి ఏదైనా అపాయం చేయాలని చూసినా వారికి దిశ యాప్ ఉంది. పోలీసులు అతనికి తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation