కరెంటు బిల్లుపై ప్రభుత్వం సంచలన ఆఫర్..

ఈ లాక్ డౌన్ వేళ ఎవ‌రూ బ‌య‌ట అడుగుపెట్ట‌లేని స్దితి, ఇప్పుడు అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు..లాక్‌డౌన్ ప్రభావంతో కరెంటు బిల్లు రీడింగ్ తీసేందుకు బిల్ కలెక్టర్లు రాలేని పరిస్థితి. దానికోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది(2019) మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెలలో కట్టుకోవచ్చని వినియోగదారులకు తెలిపింది.ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల విషయానికి వస్తే గత ఏడాది మార్చిలో వచ్చిన బిల్లులో సగం మొత్తాన్ని కట్టాలని తెలిపింది. గత ఏడాది మార్చికి సంబంధించిన బిల్లుల వివరాలను విద్యుత్తు పంపిణీ సంస్థలు నేరుగా ఫోన్‌కు సందేశం పంపనున్నాయి.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

. లాక్‌డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం లేకపోవడంతో డిస్కంలకు ఈ వెసులుబాటు కల్పిస్తూ టీఎస్ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ ముగిశాక మీటర్ రీడింగ్ తీసుకొని బిల్లు ఇస్తారు. ఒకవేళ ఎక్కువ బిల్లు చెల్లిస్తే సర్దుబాటు చేస్తారు. తక్కువ బిల్లు చెల్లిస్తే వచ్చే నెలలో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు గ‌త ఏడాది 100 యూనిట్లు వ‌స్తే అది ఇప్పుడు క‌డ‌తారు, కాని వ‌చ్చే నెల‌లో రీడింగులో 110 అయితే ఆ 10 యూనిట్లు తర్వాత నెల యాడ్ అవుతుంది.

Content above bottom navigation