అందరికి ఫ్రీ ఫుడ్….సీఎం నిర్ణయం

124

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేజ్రీవాల్ ప్రభుత్వం స్వయంగా ఆహారం అందజేస్తున్న విషయం తెలిసిందే. నైట్ షెల్టర్లలో తలదాచుకుంటున్నవారు, పేదలు మొత్తం 20వేల మందికి 325 పాఠశాలల్లో రెండు పూటలా ఆహారం అందజేస్తున్నారు. తాజాగా, దీనిని మరింత మందికి విస్తరించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నిర్ణయించారు. మొత్తం 325 పాఠశాలల్లో ప్రస్తుతం 20,000 మంది ఆహారం అందజేస్తున్నామని, నేడు 2 లక్షల మందికి అందజేయనున్నామని అన్నారు.

సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

Telangana will help students from Andhra Pradesh and techies ...

అంతేకాదు, శనివారం నుంచి దీనిని రెట్టింపు చేస్తామని, ఢిల్లీవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నాలుగు లక్షల మందికి రోజూ ఆహారం అందజేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. అభాగ్యుల ఆకలిని తీర్చడం కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చొరవను అందరూ అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 39 కేసులు నిర్ధారణ అయ్యాయని, వీరిలో 29 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా, 10 మంది స్థానికులని పేర్కొన్నారు. వీరంతా ప్రస్తుతం క్వారంటైన్‌లోనే కొనసాగుతున్నారన్నారు. ఎలాంటి సవాళ్లను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

కరోనా వైరస్ కేసులు సంఖ్య వేగంగా పెరిగితే తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ రూపొందించడానికి ఐదుగురు వైద్యులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేసినట్టు వివరించారు. లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో పిండి మిల్లులను పోలీసులు మూసివేయించిన అంశం తన దృష్టికి వచ్చిందని, తక్షణమే వాటిని తెరిచేలా ఆదేశాలు జారీచేస్తామని అన్నారు.ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, దీనిని అరికట్టడానికి తమ వంతు సహాకారం అందజేయాలని ముస్లిం సోదరులకు ఢిల్లీలోని జామా మసీదు ఇమాన్ కోరారు. ముస్లిం సోదరులు కొద్ది రోజుల పాటు మసీదుల్లో సామూహిక ప్రార్ధనలు వాయిదా వేసుకోవాలని, ఇంట్లోనే వాటిని చేసుకోవాలని ఢిల్లీలోని జమా మసీదు షాహీ ఇమాన్ సయ్యద్ అహ్మద్ బుఖారీ విజ్ఞ‌ప్తి చేశారు.

Content above bottom navigation