లాక్ డౌన్ ఎఫెక్ట్ ఒక్కో ఫ్యామిలీకి రూ.1500.. డబ్బు జమ, చెక్ చేస్కోండి!

వైరస్ ఎఫెక్ట్, లాక్‌డౌన్ దెబ్బకు పేదలకు ఉపాధి ఆగిపోయింది. రోజువారి కూలి పనులకు వెళ్లేవారికి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.1500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పని చేసుకుంటే తప్ప పొట్ట గడవని చాలా మందికి ఇబ్బందిగా ఉంటుందన్న ఆలోచనతో సీఎం కేసీఆర్‌ తెల్ల రేషన్‌ కార్డు ఉన్న అందరికీ రూ.1500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగూణంగా ఈ రోజు పేదల ఖాతాల్లో రూ.1500 చొప్పున జమ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,112 కోట్లు బ్యాంకులకు బదిలీ చేసిందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

Extend lockdown till month end, exempt food processing units: KCR ...

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 అందించనున్నారు. మంగళవారం ఈ డబ్బు అర్హుల అకౌంట్లలో జమకానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తెలంగాణవ్యాప్తంగా 74 లక్షలకు పైగా అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని మంత్రి తెలిపారు. మొత్తం రూ.1,112 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ నగదు బదిలీ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.. ప్రభుత్వం ఈ నిధులు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలో జమ చేసింది. అక్కడి నుంచి ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఆధార్‌ పేమెంట్‌ బ్రిడ్జ్‌ సిస్టమ్‌ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. అయితే మంగళవారం అంబేద్కర్‌ జయంతి కావడంతో బ్యాంకులకు సెలవు.. బుధవారం నుంచి చెల్లింపులు చేయనున్నారు. ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్లకు ఏటీఎం కార్డులు ఉన్నవారు మాత్రం మెసేజ్‌ వచ్చిన వెంటనే డబ్బులు తీసుకోవచ్చు.

సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించి ఇంటికే పరిమితం కావాలని, ఇంటి నుంచి బయటకు వస్తే వైరస్‌ బారిన పడతారని పేర్కొన్నారు. ఇంటిలోని ఉండి బౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం 87శాతం అంటే సుమారు 76 లక్షల తెల్లరేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేశాం. విజయవంతంగా రేషన్‌ బియ్యం పంపిణీ చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, వారి టీమ్‌ సత్యనారాయణరెడ్డిలకు అభినందనలు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు వివరాలను సేకరించిన ప్రభుత్వం.. బ్యాంకు అకౌంట్ల వివరాలను పరిశీలించింది.. ఆ డేటాతో సివిల్‌ సప్లైస్‌ వద్ద ఉన్న డేటాను స్క్రీనింగ్ చేశారు. తెల్ల రేషన్‌ కార్డుదారుకు బ్యాంకు అకౌంట్‌ ఉంటే ఆ వివరాలు అకౌంట్‌ లేకుంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి బ్యాంకు అకౌంట్‌ వివరాలను తీసుకున్నారు. రేషన్‌కార్డుతో ఆధార్‌ సీడింగ్‌ అయి ఉండి, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ లేనివారికి రెండో విడతలో నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు.

Content above bottom navigation