ఏపీలో పదోతరగతి విద్యార్థులకు శుభవార్త…

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కేంద్రం ముందు ప్రకటించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్ 14 తో ముగుస్తుందని, లాక్ డౌన్ కంప్లీట్ అవ్వగానే పదవతరగతి పరీక్షల మీద నిర్ణయం తీసుకుంటామని ఆంద్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంతకముందు ప్రకటించిన సంగతి తెలిసింధే. ఇప్పుడు కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించడంతో టెన్త్‌ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. నిజానికి పదవతరగతి పరీక్షలు మార్చి 31, 2020 నుంచి జరగాలి. కానీ ఆ సమయంలో వైరస్ విస్తృతంగా విస్తరించడం వలన పరీక్షలను వాయిదా వేశారు. ఆ తర్వాత లాక్ డౌన్ వలన పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం చెప్పలేదు.

BSEB Bihar 10th result 2019: Around 81% pass; apply for ...
హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

ఇక రాష్ట్రంలో వైరస్ కేసులు రోజురోజుకు మరింత పెరగడం, అలాగే కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ ను కంటిన్యూ చేసింది కాబట్టి పరీక్షలను మరొకసారి వాయిదా వేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఇక పరీక్షలు పోస్ట్ పోన్ అవ్వడంతో ఏం చెయ్యాలో అర్థం కానీ పరిస్థితీల్లో ఉన్నారు స్టూడెంట్స్. ఇలాగే ఇంకొన్ని రోజులు ఇంట్లో ఉంటే చదువు మీద ఇంట్రెస్ట్ పోయి, ఎక్సమ్స్ సడెన్ గా పెడితే చదివి రాయలేని పరిస్తితి వస్తుందని స్టూడెంట్స్ కంగారూ పడుతున్నారు. అలాంటి వారి కోసమే పరీక్షలు ముగిసేవరకు విద్యార్థులకు సప్తగిరి ఛానల్ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాల బోధన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచించారని మంత్రి తెలిపారు. పరీక్షలు జరిపేంత వరకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా ఈ ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని మంత్రి వెల్లడించారు. పరీక్షల ప్రిపరేషన్, సబ్జెక్టులను ఎలా అర్థం చేసుకోవాలనే అంశాలను ప్రతి రోజు సప్తగిరి ఛానల్‌ లో వీక్షించవచ్చని తెలిపారు.

సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

విద్యామృతం పేరుతో ఉదయం 10 నుంచి 11వరకు.. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పాఠాలు ప్రసారం అవుతాయని మంత్రి చెప్పారు. టెన్త్‌ పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్‌ నుంచి టీచర్ల ఎంపిక చేస్తున్నామన్నారు. ఒకవేళ విద్యార్థులు ఆ క్లాసులను మిస్ అయితే, ఆ క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్‌లోనూ చూడొచ్చని మంత్రి తెలిపారు. విద్యామృతం పేరుతో ఈ కార్యక్రమం రూపొందించామని, అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి అధ్యాపకుల ఎంపిక చేశామని తెలిపారు. ఇప్పటికే ట్రయిల్ రన్ చేసాము. విద్యార్థులు సమయాన్ని వృధా చేయవద్దు. ఈ క్లాసులను వినియోగించుకోండి.. ఆన్‌ లైన్‌ లో క్లాసులు చెప్పడానికి ఉత్సాహం ఉన్న ఉపాధ్యాయలు కూడా ముందుకు రావచ్చు అని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ సందర్భంగా అన్నారు.

Content above bottom navigation