బ్రేకింగ్ న్యూస్: మర్చి 31 వరకు అన్ని బంద్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి (COVID 19) విరుచుకుపడుతోంది. కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాధితో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా వైరస్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం అయ్యింది. వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం మార్చి 31 వరకు మరో వారం రోజులు సినిమా ప్రదర్శనలు, పబ్ లు, మాల్స్ మూసివెయ్యాలని, క్రీడా పోటీలు, సెమినార్ లు, వివాహా శుభాకార్యాలతో పాటు అనేక కార్యక్రమాలు మరో వారం రోజులు నిర్వహించరాదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31వ తేదీ వరకు తమ ఆదేశాలు అమలులో ఉంటాయని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

మాల్స్, సినిమాలు, పబ్, నైట్ పార్టీలు బంద్:
బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మాల్స్, సినిమా హాల్స్, మల్టీఫ్లక్స్ లు, పబ్ లు, నైట్ క్లబ్ లు, పార్టీ హాల్స్ తదితర రద్దీగా ఉండే అన్ని భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ అన్పీ మార్చి 31వ తేదీ వరకు మూసి వేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్. కే. సుధాకర్ మీడియాకు చెప్పారు.

రెడ్ డ్రెస్సులో రాశీఖన్నా లుక్స్


నష్టపోతామంటున్న సినీ నిర్మాతలు:
ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్చి 31వ తేదీ వరకు బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా హాల్స్, మల్టీఫ్లక్స్ లు మూసివేయాలి. ఇప్పటికే వారం రోజుల పాటు సినిమా హాల్స్ మూసివేయడంతో కొత్త సినిమాలు విడుదల చెయ్యలేకపోయామని, మరో వారం రోజుల పాటు సినిమాలు విడుదల చెయ్యకపోతే తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కొందరు సినీ నిర్మాతలు వాపోతున్నారని తెలిసింది. అయితే కొందరు నిర్మాతలు నష్టపోతారని సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు అవుతోందని, కరోనా వైరస్ వ్యాధిని పూర్తిగా అరికట్టిన తరువాతే సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రోహిత్ శర్మ ఫ్యామిలీ ఫొటోలు

వివాహాలు, సంతలు, జాతరలకు చెక్:
ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగరంగ వైభవంగా నిర్వహించే వివాహ శుభకార్యాలకు బ్రేక్ పడిది. పెళ్లిళ్లతో పాటు నిశ్చితార్థాలు, భారీ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. అదే విధంగా వివిద ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు, సంతలు నిర్వహించరాదని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ ఆలియా భట్

వేసవి శిభిరాలు, క్రీడా పోటీలకు బ్రేక్ :
వేసవి సందర్బంగా విద్యా సంస్థలకు సెలవులు ఉంటాయని బెంగళూరు నగరంతో సహ అనేక ప్రాంతాల్లో వేసవి శిభిరాలు ఏర్పాటు చెయ్యడానికి చాల మంది ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాధి రోజురోజుకు విస్తరించడంతో వేసవి శిభిరాలతో పాటు వస్తు ప్రదర్శనలు రద్దు చెయ్యాలని, క్రీడా పోటీలు నిర్వహించరాదని, సంగీత కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్స్ తదితర కార్యక్రమాలు నిర్వహించరాదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

అప్ప ప్రభుత్వం అలర్ట్:
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇప్పటికే కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి కేసులు 13 నమోదు అయ్యాయి. అనేక మందికి కరోనా వైరస్ సోకిందని అనుమానాలు వ్యక్తం కావడంతో వారికి ఐస్ లేషన్ లో చికిత్స చేయిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి అరికట్టడంలో భాగంగా ఇప్పటికే అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఎంఎన్ఎం, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని అనేక నగరాలు, పట్టణాలు బోసిపోతున్నాయి. ఇప్పుడు మరో వారం రోజులు (మార్చి 31 వరకు) కర్ణాటక బంద్ కు ప్రభుత్వం సిద్దం కావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

ఎలక్షన్ కమిషన్ మరొక సంచలన నిర్ణయం.. జగన్ కు దెబ్బ మీద దెబ్బ ..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఎలా తొలగించవచ్చంటే ?

రూ.2 వేల నోట్ల రద్దుపై కేంద్రం సంచలన ప్రకటన..

Content above bottom navigation