లాక్ డౌన్ త‌ర్వాత మోదీ అస‌లు స్కెచ్ ఇదే మోదీ సంచ‌ల‌న సందేశం

లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కష్టకాలంలో ఏ పని లేకుండా..ఇంట్లో ఉండలేక ఊరికే అలా రోడ్లపై బైక్ లు, కార్లేసుకుని తిరిగేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధిస్తే..నిబంధనలు ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.

View: In his second term, Narendra Modi is a more decisive leader ...

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపై తిరిగేవారికి రెండేళ్ల జైలు శిక్ష విధించవచ్చని కేంద్రం సూచించింది. విపత్తు యాజమాన్య చట్టం, ఐపీసీ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. లాక్ డౌన్ నిబంధనల్లో ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అజయ్ లేఖలో వివరించారు. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించారు.

డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్” ప్రకారం జారీ చేసిన ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్. పి లదేనని చెబుతున్నారు. మూడు వైరాల పాటు ఖచ్చితంగా ఈ ఆదేశాలు అమలు చేయాల్సిందేనని అంటున్నారు. “లాక్ డౌన్” నియమాలను ఉల్లంఘించి, ప్రయాణాలు చేసే వారిని 14 రోజుల పాటు “క్వారెంటైన్” కు పంపాలని కేంద్రం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు చెబుతున్నారు. కార్మికులు, విద్యార్థులు తాము నివసిస్తోన్న ప్రదేశాలను ఖాళీ చేయమని అడుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.ఈ కాలానికి వారి నుంచి ఇంటి అద్దె డిమాండ్ చేయకూడదని కూడా వారు పేర్కొన్నట్టు చెబుతున్నారు.

Content above bottom navigation