ఏపీలో తెరుచుకోనున్న హోటళ్లు, రెస్టారెంట్లు.. ప్రభుత్వం అనుమతి

212

లాక్‌డౌన్ నుంచి ఏపీ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. లాక్‌డౌన్ 5ని ప్రకటిస్తూనే.. జూన్ 8 నుంచి అన్‌లాక్ 1 మొదలవుతుందని ఇప్పటికే కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రమార్గదర్శకాలను యథావిధిగా పాటించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ 10 నియమ నిబంధనలను అనుగుణంగా పలు సూచనలతో హోటళ్లు, రెస్టారెండ్లు నడుపుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఏపీలో హోటళ్ల పున: ప్రారంభంపై ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర హోటల్ సమాఖ్యతో చర్చిస్తామని చెప్పారు. కరోనా లాక్‌డౌన్ వల్ల హోటల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి అవంతి అన్నారు.

Vijayawada: Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy addresses during a review meeting in Vijayawada on July 16, 2019. (Photo: IANS)

3 నెలల్లో ఎంతో నష్టపోయారని.. ఈ క్రమంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోటళ్లు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేస్తామని పేర్కొన్నారు అవంతి.

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా వైరస్‌తో పోరాడుతూ 2209 మంది కోలుకోగా.. 64 మంది మరణంచారు. ప్రస్తుతం ఏపీలో 927 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఏపీలో విదేశాల నుంచి వచ్చిన వారిలో 112 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 479 మందికి కరోనా సోకింది.

Content above bottom navigation