నాళాల్లో బయటపడుతున్న డెడ్ బాడీలు ఎంతమంది చనిపోయారంటే?

384

భారీ వర్షాలతో జరిగిన అపార నష్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే 1,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. వరద బీభత్సానికి 5వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని సీఎం వెల్లడించారు. ఇక భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఉన్నతస్థాయి సమీక్ష :
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో 2020, అక్టోబర్ 15వ తేదీ గురువారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సహాయ, పునరావాస చర్యలపై సమీక్షించారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షలు :
వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆహారం, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వం తరఫున వెంటనే అందించాలని సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

50 మంది మృతి :
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల 50 మంది మరణించినట్లు అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. ఆయా శాఖల వారీగా ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు నివేదించారు. గ్రేటర్ పరిధిలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని తెలిపారు. ఈ కారణంగా నగరంలోని 72 ప్రాంతాల్లో 144 కాలనీల్లో 20వేల 540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయని, 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయన్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation