వాళ్ళను 14 రోజుల్లోనే చంపేస్తాం…జగన్ సంచలన కామెంట్స్

మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన తొలి దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించారు. 24 గంటలూ ఈ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. దిశ చట్టానికి సంబంధించిన ఓ ప్రత్యేక యాప్‌ను కూడా ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మహిళల రక్షణే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని.. వీటి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు హోం మంత్రి సుచరిత తెలిపారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీళ్లంతా 24 గంటలూ… మహిళల భద్రత కోసం పనిచేస్తాయని సుచరిత తెలిపారు.

Image result for jagan

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. దిశ పోలిస్ స్టేషన్ ఏర్పాటు అనేది ఓ విప్లవాత్మక నిర్ణయమని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులతో 52 మంది సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. నేరాలు ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా చట్టాలు ప్రయోగిస్తామని అన్నారు జగన్. దిశా చట్టం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం అన్నారు. మహిళల భద్రత కోసమే దిశా చట్టం తీసుకోచ్చామన్న జగన్, హైదరాబాద్ దిశా ఘటన కలచి వేసింది అన్నారు. చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అత్యాచారాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మన చట్టాలు ఏం చెబుతున్నాయని ప్రశ్నించారు జగన్. సినిమాల్లో మాదిరిగా దోషులను కాల్చి చంపే స్వేచ్చ మన చట్టాల్లో లేవన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

త్వరగా న్యాయం అందకపోతే చట్టాలపై నమ్మక౦ పోతుంది అన్నారు జగన్. త్వరగా శిక్షలు పడితే వ్యవస్థలో భయం వస్తుందని అన్నారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్ళు అయినా శిక్ష పడలేదు అన్నారు. విచారణకు ఏళ్ళకు ఏళ్ళు పడుతుంటే నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. మార్పు తీసుకురావాలనే ఆలోచనలో నుంచి పుట్టిందే దిశ చట్టమని అన్నారు జగన్. దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసుల విషయంలో 14 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి.. 21 రోజుల్లోపే శిక్ష ఖరారయ్యేటట్టుగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతీ రంగంలో మహిళలకు తోడుగా ఉండే ప్రభుత్వం మాదీ అన్నారు జగన్. అయితే ఇందుకోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే, ఘటన తీవ్రతను బట్టి ఉరిశిక్ష కూడా విధిస్తారు. సోషల్ మీడియా, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు. ఇలాంటి చాలా ఆసక్తికర అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. అందుకే దీన్ని ప్రతిపక్షం కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కేంద్రం తాజాగా దిశ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ఆ చట్టాన్ని ఆమోదించకుండా తిరిగి ఏపీకి పంపింది. సవరణలు చేసి మళ్ళి కేంద్రానికి పంపనుంది రాష్ట్రప్రభుత్వం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation