ఏపీ ఎన్నికల కమిషనర్‌‌ను తొలగించిన జగన్ సర్కారు

తాజాగా ఏపీలో ఈసీ వ‌ర్సెస్ ప్ర‌భుత్వం అనే విధంగా ఇక్కడ రాజ‌కీయం మారింది అనేది తెలిసిందే.
ఈ స‌మ‌యంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఆర్డినెన్స్ ద్వారా రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని గవర్నర్‌కు పంపగా.. వెంటనే ఆయన ఆమోద ముద్ర వేశారు. దీంతో జగన్ సర్కారు వెంటనే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ విధుల నుంచి రమేశ్ కుమార్‌ను తప్పించింది.

సొగసులతో చిత్తు చేస్తున్న నటి అనన్య పాండే

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌ ...

ప్రభుత్వానికి సంక్రమించిన అధికారంతో ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్‌‌ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రెండు జీవోలను జగన్ సర్కారు కాన్ఫిడెన్షియల్‌గా ఉంచినట్లు తెలుస్తోంది. కాగా ఎస్ఈసీని ఆర్డినెన్స్ ద్వారా తప్పించడం చెల్లుబాటు కాకపోవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న అమైరా దస్తూర్

మార్చి నెలలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా.. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ రమేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రోద్బలంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార పక్షం ఆరోపించింది. సీఎం జగన్ సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నికలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో గవర్నర్‌ హరిచందన్‌‌ వద్దకు వెళ్లడంతో.. ఆయన సీఈసీని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. మ‌రి చూడాలి ఇది వ‌చ్చే రోజుల్లో ఎలా సాగుతుందో.

Content above bottom navigation