జగన్ గుడ్ న్యూస్ AP లో లాక్ డౌన్ ఉన్నా ప్రయాణం చెయ్యివచ్చు

వైరస్ కారణంగా భారత్ లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వలన లాభం ఎంత ఉన్నా కానీ సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈరోజుతో లాక్ డౌన్ కంప్లీట్ అవ్వనుంది. అయితే ఈ లాక్ డౌన్ ను కంటిన్యూ చేస్తారా లేదా క్లోజ్ చేస్తారా అనేది ఈరోజు మోడీ ప్రెస్ మీట్ తర్వాత తేలనుంది. అయితే లాక్ డౌన్ లో కొందరికి మినహాయింపు ఇవ్వాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంతమంది లాక్ డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నాడు. అత్యవసరంగా వెళ్లేవారికోసం పాసులు జారీ చేస్తామని డీజీపీ కార్యాలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనను జారీ చేశారు.

CM YS Jagan makes fresh plea for special status for Andhra Pradesh
వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

వైరస్ లాక్ డౌన్ ను ప్రజలంతా పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ నివేదిక సమర్పించడంతో ప్రభుత్వం కొంత సడలింపు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. పాసులు కావాలనుకునేవారు.. 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు చేయనున్నారు. అవసరం లేకున్నా కేవలం తిరగటానికి పాసులు పొందాలనుకునే వారికి మాత్రం కఠిన శిక్షలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వైరస్ ఎమర్జెన్సీ వెహికల్ పాసులు కావాలనుకునే ప్రజలు నేరుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని, అక్కడి సిబ్బంది పాస్ పొందే విధానంపై గైడ్ చేస్తారని డీజీపీ కార్యాలయం అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

ఇదిలా ఉండగా లాక్డౌన్ గడువు ముగియనున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఏఏ ప్రాంతాలు ఏఏ జోన్లలోకి వస్తాయన్న చర్చ ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలోని మూడు జిల్లాలను గతంలో కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జిల్లా కేంద్రాలు రెడ్ జోన్ పరిధిలోకి రానున్నాయి. ఆ జిల్లా కేంద్రాలతో పాటు వివిధ మండలాలు కూడా రెడ్ జోన్ పరిధిలోకి రానున్నాయి. రెడ్ జోన్ల పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 676 మండలాలు ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్టణం జిల్లా కేంద్రాలతో పాటు, విజయవాడ పట్టణం రెడ్ జోన్లో ఉన్నాయి. ఇక వైరస్‍ ను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‍ డౌన్‍ ను విజయవంతంగా అమలు చేస్తూ, ఈ వైరస్‍ చెన్‍ ను తెగగొట్టడంలో విజయం సాధించిన రాష్ట్రాలలో ఆంధప్రదేశ్‍ మొదటి స్థానం దక్కింది. భారత్‍ లో లాక్‍ డౌన్‍ ను విజయవంతంగా పాటిస్తూ వైరస్ ను కట్టడికి కృషి చేస్తున్న రాష్ట్రాలపై ప్రముఖ జాతీయ న్యూస్‍ చానెల్‍ ఎన్డీటీవీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఏపీ మొదటి స్థానంలో, కేరళ రెండో స్థానంలో నిలిచింది. వైరస్‍ క్టడికి వైఎస్‍ జగన్‍ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందని, అందుకే ఏపీలో వైరస్ పాజిటివ్‍ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగలేదని ఎన్టీడీవీ పేర్కొంది. లాక్‍ డౌన్‍ ను కట్టుదిట్టంగా అమలు చేసి వైరస్‍ చైన్‍ ను తెగగొట్టడంలో ఏపీ పెద్ద విజయం సాధించిందని ప్రశంసించింది.

Content above bottom navigation