పవన్ కళ్యాణ్ పార్టీలో విషాదం.. జనసేన నేత కన్నుమూత..

121

వన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలకు కూడా టైమ్ కేటాయిస్తున్నాడు. రెండు చోట్లా కూడా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. మొన్నటి వరకు జనసేన పార్టీ పనుల్లోనే బిజీగా ఉన్నాడు ఈయన. ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు వచ్చాడు. అయితే ఇప్పుడు జనసేనానికి వ్యక్తిగతంగా దెబ్బ తగిలింది. ఈయన పార్టీ నేత, నూజివీడు మున్సిపల్ మాజీ ఛైర్మన్ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు అనారోగ్యంతో మరణించాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఫిబ్రవరి 22న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భాస్కరరావు మృతి పట్ల పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. ఈయన మరణం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసాడు. నూజివీడు ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివి అంటూ కొనియాడాడు జనసేనాని.

ఈ క్రింది వీడియో చూడండి

పార్టీ నుంచి కూడా ఆయనకు సంతాపం వ్యక్తం చేసారు. నూజివీడు ప్రాంతంలో జనసేనను బలోపేతం చేయడానికి భాస్కరరావు చేసిన కృషి ఎన్నడూ మరువలేమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మరణించారనే వార్త విన్న వెంటనే ఎంతో బాధ అనిపించిందని పవన్ కళ్యాణ్ మీడియాకు తెలిపాడు. మృధుస్వభావువి అయిన ఓ స్నేహితుడిని కోల్పోయామని ఎమోషనల్ అయ్యాడు పవన్. ఆయనతో పాటు పలువురు జనసేన నేతలు కూడా భాస్కరరావుకు సంతాపం వ్యక్తం చేసారు. తన తరఫున, తన పార్టీ తరఫున భాస్కరరావుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపాడు పవన్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు పవర్ స్టార్.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation