మంత్రి అనిల్ ను ఇక్కడ అడుగుపెట్టలేవ్ అని హెచ్చరించిన కర్నూలు నేతలు

107

వైసీపీలో ఇదో ఉప్రదవం.. మంత్రి అనిల్ ను కర్నూలులో అడుగు పెట్టలేవ్ అని ఏకంగా వైసీపీ నందికొట్టూర్ ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ అనుచరుడు హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికంతటికి కారణం మంత్రి అనిల్ మార్కెట్ కమిటీ విషయంలో వేలు పెట్టడం.. ఆధిపత్యం చెలాయించడమే కారణమని తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో ని చూడండి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే ముందే ఓ కార్యకర్త మంత్రి అనిల్ ను హెచ్చరించడం దుమారం రేపింది. వైసీపీలో చేరిక కార్యక్రమంలో పాములపాడు మండలానికి చెందిన ఓ ముఖ్య కార్యకర్త ఇలా సొంత పార్టీ మంత్రిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎంపికపై జరుగుతున్న వర్గ పోరులో మంత్రి అనిల్ ఆధిపత్యం చెలాయించడమే ఆ కార్యకర్త వ్యాఖ్యలకు కారణమని తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఇన్ చార్జి మంత్రిగా అనిల్ అక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సపోర్టు చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే ఆర్థర్ వర్గానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎమ్మెల్యే ముందే మంత్రిపై ఆరోపణలు చేశారు.

Kurnool Leaders Warns Anil Kumar to Not Step in Kurnool

తమ వర్గం వారికి పదవి ఇవ్వలేదనే కారణం తో ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు ఇన్ చార్జి మంత్రి అనిల్ నే రౌడీషీటర్ హంతకుడు అని దూషించడం సంచలనంగా మారింది.బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య కొద్దికాలంగా వైరం నడుస్తోంది. ఎమ్మెల్యే ఆర్థర్ ఇటీవలే మార్కెట్ కమిటీకి ఓ పేరును ప్రతిపాదించారు. బైరెడ్డి మరో వ్యక్తి పేరును పంపారు. వైసీపీ అధిష్టానం బైరెడ్డి వర్గానికే మద్దతు తెలిపింది. దీంతో పాటు కాంట్రాక్టుల్లో కూడా బైరెడ్డి దక్కించుకోవడంతో ఆర్థర్ వర్గం ఇలా మంత్రి అనిల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ బైరెడ్డి ఎమ్మెల్యే మంత్రి వివాదాన్ని మరి వైసీపీ అధిష్టానం పరిష్కరిస్తుందా.. ఇలానే రోడ్డున పడేలా చేస్తుందా అన్నది పార్టీలో చర్చీనీయాంశంగా మారింది.

ఈ క్రింది వీడియో ని చూడండి

Content above bottom navigation