విషాదంలో సీఎం జగన్.. ప్రాణ స్నేహితుడు మృతి

రాష్టాన్ని ప్రగతి బాటవైపు నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. తనను ఎంతో ప్రేమించి, అభిమానించే ఆయన బాల్య మిత్రుడు చనిపోయాడు. సీఎం జగన్‌పై అభిమానం చాటుకునే ప్రయత్నంలో ఆయన స్కూల్‌ మేట్‌ తోపాటు మరొకరు ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే…

అనకాపల్లి పట్టణంలోని శ్రీరామ్ నగర్‌కు చెందిన ఏడిద జగదీష్ చిన్నతనంలో వైఎస్ జగన్‌ తో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆయనకు జగన్ అంటే ఎంతో అభిమానం. ఎన్నికల సమయంలో తన సొంత ఇంటి సభ్యుడికి ప్రచారం చేసినట్టు వైసిపి పార్టీ తరుపున ప్రచారం చేశాడు. వైసిపి నేతలతో కలిసి ఇల్లు ఇల్లు తిరిగి జగన్ కు ఓటు వెయ్యమని వేడుకున్నాడు. జగన్ పాదయాత్ర చేపట్టినప్పుడు, అనకాపల్లిలో ఆయన్ను జగదీష్ కలిశారు. చిన్నతనంలో కలిసి చదువుకున్నప్పటి ఫొటోలు, పాదయాత్రలో పాల్గొన్నప్పుడు కలిసి దిగిన ఫొటోలతో జగదీష్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న జగదీష్ తన అభిమానాన్ని ఎంతో గొప్పగా చాటుకోబోతున్నానని భావించారు. ఈ ఫ్లెక్సీని ఇంటి ముందు కట్టడం కోసం గురువారం డాబా మీదకు ఎక్కారు. ఇందుకోసం ఆయన దూరపు బంధువైన ముప్పిడి శ్రీను అనే వ్యక్తం సాయం కోరారు. ఇద్దరూ ఫ్లెక్సీ కడుతుండగా, ఒక్కసారిగా గాలి వీయడంతో అది ఇంటి ముందున్న హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడింది.

Image result for ఏడిద జగదీష్

హైటెన్షన్ వైర్ల నుంచి విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరికీ కరెంట్ షాక్ తగిలింది. ఇద్దర్నీ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా జగదీష్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. శ్రీను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. జగన్ ఫ్లెక్సీ కట్టే క్రమంలో ఇద్దరు ప్రాణాలు వదలడంతో.. వారి కుటుంబాలతోపాటు అనకాపల్లి వైఎస్సార్సీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. జగదీష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన భార్యకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసి సీఎం జగన్ సైతం విషాదంలో మునిగిపోయినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా జగదీశ్ మృతికి జగన్ నివాళులు అర్పించాడు.

Content above bottom navigation