breakingnews : ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కన్నుమూత

68

ఈ మధ్య వరుసగా ప్రముఖులు చనిపోతున్నారు. అటు సినీ, ఇటు రాజకీయ రంగంలో ప్రముఖులు వివిధ కారణాల వలన కన్నుమూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరొక విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి (87) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఈ క్రింది వీడియోని చూడండి

1933 డిసెంబర్ 28న చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో జన్మించారు. 1957లో తూకివాక గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అంతకముందు ఈయన తండ్రి వెంకట సుబ్బారెడ్డి కూడా సర్పంచ్ గా పనిచేశారు. 1962లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆయన.. రెండోసారి తిరుపతి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 1981-82లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. అనంతరం కొన్నాళ్లపాటు స్పీకర్‌గా పని చేశారు. అయితే, 1983లో టీడీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. తిరుపతిలో ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆయన పేరు అప్పట్లో బాగా మారుమోగింది. 1987 లో మళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అయన రాజకీయాలకు వీడ్కోలు పలికాడు. మళ్ళి ఏ ఎన్నికలో కూడా పోటీ చెయ్యలేదు. అయితే ఈయన వారసులు ఎవరు కూడా రాజకీయాల వైపు రాలేదు.

ఇక ఇటీవలే మీడియా ముందుకు వచ్చి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించారు. కర్నూలులో హైకోర్టు, విశాఖలో రాజధాని ఉండటం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అమరావతి కోసం జోలె పట్టుకొని తిరగడం సిగ్గుచేటన్నారు. ‘చంద్రబాబు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలను కొనగలడు. ఇంకా ఆయనకు జోలె ఎందుకు’ అని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాబు, అగరాల ఒకే జిల్లాకు చెందినప్పటికీ.. ఆయన టీడీపీకి వ్యతిరేకంగానే వ్యవహరించారు. ఇక ఈయన మరణవార్త విని పలువురు కాంగ్రెస్ నాయకులూ నివాళులు అర్పించారు. అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. రేపు సొంత గ్రామం అయినా తుకీవాకంలో లో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation