ఇండియా వస్తున్న ట్రంప్ మోడీ సంచలన నిర్ణయం ఏమి గిఫ్ట్ ఇస్తున్నాడో తెలుసా ?

82

అగ్రరాజ్య అధినేత ప్ర‌పంచానికే పెద్దన్న ఏ దేశ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా రాచ‌మ‌ర్యాద‌లు జ‌రుగుతాయి
ఇక స్నేహ‌దేశం , పెద్ద‌న్న‌తో క‌లిసి వాణిజ్య వ్యాపారాలు చేస్తున్న భార‌త్ కూడా అమెరికాతో స‌ఖ్య‌త కలిగిన దేశం.ఈ స‌మ‌యంలో పెద్ద‌న్న దేశం నుంచి అమెరికా అధ్య‌క్షుడు భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు
దీంతో ఇరు దేశాల అధినేత‌ల భేటీ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉత్కంఠ నెల‌కొంది.

Image result for trump modi

అగ్రరాజ్యమనే కానీ.. అమెరికా లాంటి దేశాల్లో భారీ సభ అంటే వేలల్లోనే వస్తారు కానీ మన మాదిరి లక్షలాది మంది రావటం ఉండదు. ఇలాంటివేళ.. ఒకే చోట లక్షన్నర మంది కనిపిస్తే ఎలా ఉంటుంది. వావ్.. అమేజింగ్ అనే భావన మనసుకు రావటమే కాదు.. తన కోసం ఇంత భారీ ఏర్పాట్లు చేసిన వారి పట్ల పెరిగే అభిమానం ఎంతలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సరిగ్గా.. ఇలాంటి ఆలోచనే చేస్తున్నారు ప్రధాని మోడీ. అందుకే త‌గిన ఏర్పాట్లు కూడా షురూ చేశారు.

Image result for modi and trump

ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిదా అయ్యేలా ప్రధాని మోడీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన్ను గుజరాత్ లోని అహ్మదాబాద్ కు తీసుకెళ్లనున్నారు. గత ఏడాది అమెరికాలో నిర్వహించిన హోఢీ – మోడీ తరహా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలని భావిస్తున్నారు. దీనికి స్థానికులు కెమ్ ఛో ట్రంప్ (ట్రంప్.. మీరెలా ఉన్నారు?) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇక్కడకు వచ్చే ట్రంప్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా పది కిలోమీటర్ల పొడవునా భారీ రోడ్డు షో నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లను షురూ చేశారు. అహ్మదాబాద్ లో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియం ఇరువురు నేతలు ప్రారంభించనున్నారు. దగ్గర దగ్గర రూ.700 కోట్లతో ఈ స్టేడియంను నిర్మించారు. ఈ స్టేడియం ప్రత్యేకత ఇంకొకటి ఉంది. దీని సామర్థ్యం 1.10 లక్షలు. ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కావటం గమనార్హం.

ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం అతి పెద్దదిగా ఉండేది. దీని సామర్థ్యం లక్ష సీట్లు అయితే.. అందుకు భిన్నంగా మరో పదివేల మంది అదనంగా కూర్చునేందుకు వీలుగా ఈ స్టేడియంను నిర్మించారు. అంతేకాదు.. ఇదే స్టేడియంలో మోడీ.. ట్రంప్ లు కలిసి సంయుక్తంగా మాట్లాడతారు. అంటే.. స్టేడియంలో ఆ రోజు 1.10లక్షల మంది ప్రజలే కాకుండా.. స్టేడియం బయటా భారీగా పోటెత్తే ప్రజల్ని చూసే ట్రంప్.. వారంతా తనకు స్వాగతం పలికేందుకు వస్తున్నందుకు ఫుల్ హ్యాపీ ఫీల్ కావటం ఖాయం. మొత్తంగా ట్రంప్ అసాంతం సర్ ప్రైజ్ అయ్యేలా ట్రంప్ టూర్ కార్యక్రమం ఉంటుందన్నమాట. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌పై పాక్ కూడా ఆసక్తిగాచూస్తోంది , ఎలాంటినిర్ణ‌యాలు తీసుకుంటారు అనేది చైనా కూడా ఆలోచిస్తోంది, ఇరువురు భేటీలో ప‌లు వాణిజ్య బిల్లుల‌పై చ‌ర్చించి ఒప్పందాలు చేసుకోనున్నార‌ట‌. అంతేకాదు భార‌తీయ సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా ఓ అద్బుత‌మైన గిఫ్ట్ కూడా ట్రంప్ కు ఇవ్వ‌నున్నార‌ట ప్ర‌ధాని మోదీ.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation