మోడీ పై JP సంచలన వాఖ్యలు

కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం పాక్షిక సమస్యగా చూస్తోందని..ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. పడుతూ లేస్తూ.. బతుకుదాం అని అనుకుంటే పొరపాటని..కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతాయని తెలిపారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు లాక్ డౌన్ ను మే 03వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

Nagabhairava Jaya Prakash Narayana - Alchetron, the free social ...
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

విదేశాలతో పోలిస్తే కరోనా నివారణకు మనం చేస్తున్న ఖర్చు చాలా తక్కువేనని.. కరోనా ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు సంపన్నదేశాలు రూ. 6 కోట్ల కోట్లు కేటాయిస్తే..మోడీ ప్రభుత్వం ఎంత ఇచ్చిందని సూటిగా ప్రశ్నించారు. లాక్‌డౌన్‌లో మొదటి మూడు వారాల కంటే.. తర్వాతి మూడు వారాల్లో సంక్షోభం మరింత తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. పలు రంగాలు దెబ్బతిన్నాయని, రాష్ట్రాలకు ఆదాయం ఆగిపోయిందని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని జేపీ వ్యాఖ్యానించారు.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

అసంఘటిత రంగాల్లో ఉన్న వారి పరిస్థితి ? చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే ఏం చేయాలి ? అని ప్రశ్నించారు. సంఘటిత రంగంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. సంపన్నదేశాల్లో ఆదాయం లేక చేత్తులు ఎత్తేస్తుంటే..మరి భారతదేశ పరిస్థితి ఏంటీ అని నిలదీశారు. ఆదేశాలు జారీ చేస్తే సరిపోతుందా ? ఆర్థిక సంక్షోభంలో కూరుకపోతుంటే..ఏం చేస్తున్నారన్నారని వెల్లడించారు.కరోనా వైరస్ ను అరికట్టేందుకు విరాళాలు ఇస్తున్న వారికి పన్ను రాయితీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆదేశాలు, ఉపదేశాలు ఇస్తున్నారు..కనీసం వితరణతో పేదలను ఆదుకొనే ప్రయత్నం చేయాలన్నారు. రాయితీలు ఇచ్చి ప్రొత్సాహాకాలివ్వాలని, ఇందుకు చట్టాలు సవరించాలి..ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇస్తే..వంద శాతం మినహాయింపు..ఉందన్నారు. పరిశ్రమల విషయంలో కూడా స్పందించలేదని విమర్శించారు. ఆరోగ్యరంగంలో రెండు వేల మంది శిశువులు చనిపోతున్నారని, ఎన్నో రంగాలు అవసరమన్నారు జేపీ. 

Content above bottom navigation