ట్రంప్ వెళ్ళగానే ఢిల్లీ లో దారుణం.. 13మంది మృతి.. షాక్ లో మోడీ

129

ప్రశాంతంగా ఉన్న హ‌స్తిన‌లో మ‌రోసారి అల్ల‌ర్లు చెల‌రేగాయి.కూల్ గా ఉంద‌నుకుంటే కుంప‌టి రాజేసారు.
ట్రంప్ పర్య‌ట‌న ఓ వైపు అల్ల‌రి మూక‌ల రాక్ష‌స విజృంభ‌న‌మరోవైపు.దిల్లీ పోలీసుల‌కి నిన్న‌టి ప‌రిస్దితి క‌త్తిమీద సాములా మారింది .కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం మంటలు మళ్లీ అంటుకున్నాయి. నిశ్శ‌బ్దం అనుకుంటే సైలెంట్ పాయిజ‌న్ లా కొంద‌రు రోడ్ల‌పై రెచ్చిపోయారు.ఏకంగా గ‌న్స్ తో హ‌ల్ చ‌ల్ చేశారు హ‌స్తిన‌లో. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీని రణరంగంగా మార్చేశాయి.దేశంలో ఈ అల్ల‌ర్లను నిలువ‌రించాల్సిన బాధ్యత కేంద్రంపై ఎంతైనా ఉంది.ఓవైపు కేంద్రం మ‌రో వైపు ఢిల్లీ స‌ర్కారు… వీటిని నిలువ‌రించ‌క‌పోతే ఇది దేశం అంతా పాకే ప్ర‌మాదం ఉంది.

Image result for ఢిల్లీ లో దారుణం.. 13మంది మృతి.

ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హింసలో ఏకంగా 13మంది చనిపోవడంతో కేంద్రం సీరియ‌స్ అయింది. అమిత్ షా ఆగమేఘాల మీద పోలీస్ ఉన్నతాధికారులతో శాంతి భద్రతలపై సమీక్షించారు. మంగళవారం రాత్రంతా ఈ భేటి కొనసాగింది. గవర్నర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ భేటిలో పాల్గొన్నారు.బీజేపీ నేత కపిల్ మిశ్రా ఓ వర్గంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలే తాజా హింసకు కారణమయ్యాయి. ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి దుకాణాలు వాహనాలు ధ్వంసం చేశారు. పోలీసులపై యాసిడ్ దాడి చేశారు. రాళ్లు కర్రలతో దాడిచేశారు. రోడ్ల‌పై క‌నిపిస్తే నెత్తుటి ధార‌లే క‌నిపించాయి

Image result for felhi

ఇరువ‌ర్గాలు చేసుకున్న కాల్పుల్లో 13మంది మరణించగా.. దాదాపు 100 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. ఈశాన్య ఢిల్లీలో శాంతిని పునరుద్దరించడానికి రాజకీయ పార్టీలు చేతులు కలపాలని.. శాంతిని పాటించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే ప్రసంగాలు మానాలని కోరారు.

ఓ వైపు ఢిల్లీ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కొనసాగుతుండగానే ఆందోళనలు చేయ‌డం.. 13మంది చనిపోవడం కేంద్రానికి గుబులు రేపింది. అమిత్ షా ఆగమేఘాల మీద దీనిపై సమీక్షించారు. ముఖ్యంగా ట్రంప్ దేశీయ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌టంతో న‌రేంద్ర‌మోదీ రెండు రోజులుగా ఆయ‌న‌తో ఉన్నారు, ఈ స‌మ‌యంలో ఉన్న‌త అధికారులు ప్ర‌తీ విష‌యం ఆయ‌న‌కు అప్ డేట్ అందించారు, వెంట‌నే అమిత్ షా ని ఆయ‌న రంగంలోకి దించారు అని తెలుస్తోంది. అయితే నేత‌ల మాట‌లు కోట‌లు దాట‌డం.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేసుకోవ‌డంతో.. ఆనాయ‌కులు బాగానే ఉంటున్నారు, కాని అమాయక ప్ర‌జ‌లు మాత్రం రోడ్ల‌పైకి వ‌చ్చి చివ‌ర‌కు ప్రాణాలు కోల్పోతున్నారు.హ‌స్తిన‌లో శాంతి నెల‌కోనాల‌ని మ‌నం కూడా కోరుకుందాం.

Content above bottom navigation