ఎవరీ ఈ సంచైత గజపతిరాజు ? సీఎం జగన్ ఆమెను రాత్రికి రాత్రి ఎందుకు దించారంటే ?

125

గజపతిరాజుల కుటుంబ పర్యవేక్షణలో ఉన్న మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం అనేకానేక అనుమానాలకు దారి తీస్తోంది. ఆ ట్రస్ట్‌కు రూ. లక్ష కోట్లకు పైగా విలువైన పద్నాలుగు వేల ఎకరాల భూములు ఉండటం మాత్రమే కాదు, 105 ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఆ ట్రస్ట్ చైర్మన్ ఉంటారు. ఆ ఆలయాలకు మరో 9వేల ఎకరాల భూములు ఉన్నాయి. అలాంటి ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును తీసేసి.. సంచైత గజపతిరాజు అనే మహిళను తెరపైకి తెచ్చారు. అనూహ్యంగా.. అశోక్ గజపతిరాజును తొలగిస్తున్నట్లుగా రహస్య జీవో ఇచ్చి తెల్లవారే సరికి.. ఆమెతో మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా… అలాగే సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా కూడా ప్రమాణస్వీకారం చేయించేశారు. దీంతో తెర వెనుక ఏం జరుగుతోందనేదానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎవరు ఈ సంచైత. ఈమెకు జగన్ ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు. దీని వెనుక ఏమైనా గూడుపుఠాణి ఉందా.. ఇలాంటి విషయాల గురించి ఒక్కసారి పరిశీలిస్తే..


ఎవరీ సంచైత గజపతిరాజు అనే విషయానికి వస్తే.. పూసపాటి వంశీకులు విజయనగరంలోని కోటలోనే నివసిస్తూంటారు. విజయనగరం జిల్లా ప్రజలందరికీ, పీవీజీ రాజు .. అనందగజపతిరాజు.. అశోక్ గజపతిరాజుల గురించి వారి కుటుంబసభ్యుల గురించి తెలుసు. కానీ ఈ సంచైత గజపతిరాజు గురించి మాత్రం ఎవరికీ తెలియదు. సంచైత ఆనందగజపతిరాజు మొదటి భార్య కూతురు.. ఆనందగజపతిరాజు బతికుండగానే ఆయన ఈమెతో విడాకులు తీసుకున్నాడు.

Image result for sanchita gajapathi raju

విడాకులు తీసుకున్న తర్వాత వీరితో పూసపాటి కుటుంబీలకు ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. ఆనందగజపతిరాజు గారి నుంచి విడాకులు తీసుకున్న కేరళ రాజకుమారి ఉమా గజపతిరాజు తరువాత రమేష్ శర్మ అనే దర్శకుడిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. తన ఇద్దరు ఆడ పిల్లలతో సహా ఆయనతో ఉంటున్నారు. ఆయన క్రైస్తవుడు. వీరి పేజ్ 3 కుటుంబం చాలా రిచ్. రమేష్ శర్మ తానూ గాంధీ మీద, ఆయన అహింసా సిద్ధాంతం మీద సందేశాత్మక చిత్రానికి ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతి పొందారు. తరచుగా విదేశాల్లో చర్చిలను, పాస్టర్లను దర్శించుకుంటారు. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన సంచైత ఇప్పుడు సింహాచలం ధర్మకర్తగా నియమించబడింది. వీరి కుటుంబం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. ఇక సంచైత గజపతిరాజు సన అనే ఎన్జీవో నిర్వహిస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేజ్రీవాల్, మేధాపాట్కర్ లాంటి వివిధ నేతలతో కలిసి బాలికలకు మరుగుదొడ్లు, తాగునీరు అనే అంశాల్లో పనిచేసి బాగా పేరుపొందారు. సన ఎన్జీవో సంస్థ కూడా ఆనంద్ శర్మ, ఉమాగజపతిరాజు, సంచైతా గజపతిరాజు అనే ముగ్గురి ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో ఎన్నికల ముందు భాజపాలో చేరారు తప్ప ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ చురుకుగా లేరు. సుజనాచౌదరి భాజపా పార్టీలో ఎందుకు చేరారో ఈమె కూడా అందుకే చేరినట్లు కనబడుతోంది.

ఆనందగజపతిరాజు జీవించి ఉన్నంత కాలం, వీరెవరూ విజయనగరం కోట వైపు కూడా రాలేదు. ఆనందగజపతిరాజు మరణం తర్వాత, గత ఎన్నికలకు ముందు మాత్రమే బీజేపీలో చేరడం ద్వారా వెలుగులోకి వచ్చారు. మొత్తంగా ఆమె కార్యక్షేత్రం ఢిల్లీలోనే. ఢిల్లీ బీజేపీలోనే ఓ పదవిలో ఉన్నారు. గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో బీజేపీ తరపున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు హఠాత్తుగా మాన్సస్ ట్రస్ట్ చైర్మన్‌ గా ప్రమాణం చేసేశారు. మాన్సస్ ట్రస్ట్ నిబంధనల ప్రకారం, పూసపాటి వంశీకుల వారసుల్లో పెద్దవారైన మగవారు మాత్రమే ట్రస్ట్‌ కు చైర్మన్‌గా ఉండాలి.

Image result for sanchita gajapathi raju

అలాగే సభ్యులందరి ఆమోదంతోనే చైర్మన్‌ ను ఎన్నుకోవాలి. కానీ ప్రభుత్వం అలాంటిదేమీ చేయలేదు. అర్థరాత్రి రహస్య జీవోలు విడుదల చేసి, పని పూర్తి చేసి, ఆ సమయంలో ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు వైద్య పరీక్షల కోసం ఢిల్లీలో ఉన్నారు. ఇంతగా గూడుపుఠాణి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అందరికీ వస్తున్న సందేహం మాన్సస్ ట్రస్ట్‌ కు ఉన్న వేల ఎకరాల భూమిని దోచుకోవడం కోసమని అర్థం అవుతుంది. ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుండి, ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి, మాన్సస్ భూములపై కన్నేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని అంటున్నారు.

అశోక్ గజపతిరాజు ట్రస్ట్ వ్యవహారాలను చాలా నిశితంగా పరిశీలిస్తారు. భూములు ఆక్రమణకు గురి కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనను తప్పిస్తే తమ పని సులువు అవుతుందని, భూములపై కన్నేసిన వారు ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. సంచైత ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్‌ పర్సన్, మాన్సస్ ట్రస్ట్ చైర్‌ పర్సన్‌ గా ఉంటే తమ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చని వారు అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఈ భూములపై ఇప్పటికే చాలా వరకూ ఆక్రమణలకు గురయ్యాయి. వాటి క్రమబద్దీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో మరికొన్ని భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖను కార్యక్షేత్రంగా చేసుకున్న ఓ ప్రముఖ వ్యక్తి, ఈ విషయంలో చక్రం తిప్పినట్లుగా భావిస్తున్నారు.

Image result for సంచైత గజపతిరాజు ?

రాజవంశానికి ఎవరు పెద్ద దిక్కు లేదా వారసుడో వారే ధర్మకర్తగా ప్రభుత్వం నియమించడం ఇప్పటివరకు వస్తున్న ఆచారం. దానిని తుంగలో తొక్కి ఆయన బతికుండగానే తొలగించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రహస్య జీవోలతో సంచైతను నియమించింది. మాన్సాస్ ట్రస్టు ఆధీనంలో సింహాచలంతో సహా 108 గుడులు, పధ్నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నాయి. విశాఖపట్నం రాజధాని అని ప్రకటించిన నేపథ్యంలో దీని వెనుక ఉన్న కారణాలు మనం తేలిగ్గా ఊహించవచ్చు.

Image result for sanchita gajapathi raju

రాత్రికి రాత్రే సింహాచలం ధర్మకర్త అశోకగజపతి రాజు గారిని తొలగించి మాన్సాస్ ట్రస్టును ఆయన అన్న కూతురు సంచితకు కట్టబెట్టడం వెనుక కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదు. మత కోణం, భూమాఫియా ప్రమేయం కూడా ఉంది. కాకపోతే ఈ విషయం ధైర్యంగా చెప్పడానికి తెలుగుదేశం నేతలు, అటు రాజ కుటుంబీకులు కూడా జంకుతున్నారు.

Content above bottom navigation