గర్భవతిని ఆరు కిలో మీటర్లు మోసిన ఎమ్మెల్యే

ప్రజాప్రతినిధులు అంటే ప్రజలపై తమ ఆధిపత్యం చూపించేవారు కాదు. ప్రజల కోసం పనిచేసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో కొందరు ప్రజాప్రతినిధులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల భాగోగులని పట్టించుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఆయన్ని టీవీ లోనే . పేపర్ లోనే చూడటం తప్ప , డైరెక్ట్ గా కలవడం చాలా కష్టంగా మారుతోంది. కానీ కొందరు మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తుంటారు. అలాగే మరి కొంతమంది ఏదైనా జరిగినప్పుడు తమ ఉదారతని చాటుకుంటుంటారు. ఏదైనా యాక్సిడెంట్స్ కానీ అనుకోని ప్రమాదాలు కానీ జరిగినప్పుడు అక్కడ ఉన్న లేదా అటువైపు వెళ్లే ప్రజాప్రతినిధులు ఆగి ఆ సమస్య ని అక్కడికక్కడే పరిష్కరించి కానీ వెళ్లడంలేదు. తాజాగా మరో ఎమ్మెల్యే తన ఉదారతని చాటుకున్నారు. ఒక నిండు గర్భిణిని 6 కిమీ మోశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింది వీడియోని చూడండి

ఒడిశా రాష్టం దబూగాం నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే మన్హర్ రంధారి గ్రామ పర్యటనకి వెళ్ళాడు. గ్రామంలోని అన్ని కాలనీలు తిరుగుతూ అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఆ ఎమ్మెల్యేకి ఆ గ్రామంలో ప్రసవ వేదనతో భాద పడుతున్న ఒక గర్భవతి కనిపించింది. అయితే ఆ ఇంట్లో ఆమె తప్ప ఇంకెవరు లేరు. ఇంట్లో వాళ్ళందరూ పొలం పనులకు వెళ్లారు. దాంతో ఆ మహిళ నొప్పులతో బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోయింది. ఈ ఘటనను చూసి ఆ ఎమ్మెల్యే బాగా చలించిపోయాడు. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి రావాలని చెప్పాడు. కానీ ఆ గ్రామానికి రోడ్లు భాగాలేకపోవడంతో అంబులెన్స్ గ్రామంలోకి రావడానికి నిరాకరించారు. గ్రామం రోడ్లు బాగాలేవు కాబట్టి మేము రాలేమని హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. దాంతో ఏం చెయ్యాలో ఆ ఎమ్మెల్యేకు, గ్రామస్తులకు తోచలేదు. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు వచ్చారు.

Odisha MLA Carries Pregnant Woman On Shoulders For 6 Km, గర్భవతిని ఆరు కిలో మీటర్లు మోసిన ఎమ్మెల్యే

ఇక ఆలస్యం అయితే తల్లికి, కడుపులో బిడ్డకు ప్రమాదం అని గ్రహించి వాళ్లే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే కారులో తీసుకెళ్తే బిడ్డ అటుఇటు తిరిగి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని, ఆమెను మోసుకెళ్లాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో ఆమెను ఉంచి, మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. గ్రామస్తులతో పాటు, ఆ ఎమ్మెల్యే కూడా ఆ గర్బవతిని ఆరు కిలోమీటర్లు మోసి ఆస్పత్రికి తరలించారు. దీనిని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో బాగా వైరల్ అయ్యింది. ఈ ఎమ్మెల్యే చేసిన ఈ సేవకు సోషల్ మీడియా లో ప్రశంసలు అందుకుంటున్నారు. నిజంగా మీలాంటి ఎమ్మెల్యే ప్రతి రాష్టంలో ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇక గర్భవతి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి కూడా రావడానికి నిరాకరించిన అంబులెన్స్ వాళ్ళ యాక్షన్ తీసుకోబోతున్నాడు మన్హర్ రాంధారీ.

ఈ క్రింద వీడియో చూడండి: