జగన్ ను కాదని చంద్రబాబుకు ఫోన్ చేసిన మోడీ

ప్రధాని మోదీ మంగళవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు ఉదయం ఎనిమిదిన్నర సమయంలో మోదీ ఫోన్ చేశారు. వైర్‌సను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై ఇద్దరూ సంభాషించుకున్నారు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారిద్దరూ మాట్లాడుకోవడం ఇదే ప్రథమం. ఇటీవల చంద్రబాబు ఒక అధ్యయన సంస్థను నెలకొల్పారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఎ్‌ఫఎ్‌సటీ) పేరుతో దీనిని రిజిస్టర్ చేశారు.

Coronavirus Updates: No Central Minister Will Travel Abroad In ...
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

సీబీఎన్ ఫౌండేషన్ దీనికి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇది ఏర్పాటైన సమయంలోనే వైరస్ వ్యాపించింది. దీనిపై ఫోరం తరపున అధ్యయనాలు, చర్చా గోష్ఠులు నిర్వహించి.. తీసుకోవలసిన చర్యలపై కొన్ని ప్రతిపాదనలు రూపొందించారు. వాటిని ఈ నెల 10నచంద్రబాబు ప్రధాని కార్యాలయానికి పంపారు. వీటిపై ప్రధానితో మాట్లాడాలని తాను భావిస్తున్నట్లు ఆయన సోమవారం ఉదయం ఆయన కార్యాలయానికి తెలియజేశారు.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

దీంతో మోదీ ఆయనకు ఫోన్ చేశారు. కొందరు నిపుణులతో మాట్లాడినప్పుడు వారిచ్చిన సూచనలను ఈ సందర్భంగా చంద్రబాబు మోదీకి వివరించారు. ‘మీరు ఇప్పటిదాకా బాగా చేశారు. సరైన సమయంలో విదేశాల నుంచి ఎవరూ రాకుండా ఆపడంతోపాటు లాక్డౌన్ విధించారు. ఇవి మంచి ఫలితాలిచ్చాయి. లాక్డౌన్ నుంచి ఏ సమయంలో ఎలా బయటకు రావాలన్నది ముఖ్యం. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకోండి.ఆ జిల్లాలో ఆఖరి కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మరో 14 రోజుల వరకూ కొత్త కేసు నమోదు కాకపోతే అప్పుడు దానిని గ్రీన్ జోన్‌గా చేసి నిబంధనలు సడలించండి. కేసుల నమోదు కొనసాగుతుంటే వాటిని రెడ్ జోన్లుగా ప్రకటించి మరింత కఠినంగా ఆంక్షలు అమలు చేయండి. పరీక్షల సామర్థ్యం, ఆస్పత్రుల మౌలిక వసతులు ఇంకా పెంచాలి’ అని సూచించారు. ఇవి మంచి సూచనలని, తాను కూడా అందరితో మాట్లాడుతూ జాతీయ ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నానని.. ఆ ప్రకారమే ముందుకు వెళ్తానని మోదీ చెప్పారు. ఏవైనా సూచనలుంటే తన కార్యదర్శికి పంపాలనీ సూచించారు.

Content above bottom navigation