Breaking News : ప్రధాని మోదీ గుడ్ బై సంచలన ట్వీట్ కార‌ణం ఇదే

భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఆయన కూడా ఒకరు. అయితే, కారణాలు తెలియదు కానీ, ఈ ఆదివారం నుంచి తాను సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాలని భావించినట్టు మోదీ వెల్లడించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను.. అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై ఆయన త్వరలో మరింత వివరణ ఇచ్చే అవకాశం వుంది.

Image result for modi

ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో కోట్ల మంది ఫాలోవర్లను కలిగివున్న ప్రధాని నరేంద్ర మోదీ, తాను ఈ ఖాతాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని చేసిన ట్వీట్ వైరల్ అయింది. ప్రధాని చేసిన ట్వీట్ గంట వ్యవధిలోనే 26 వేలసార్లకు పైగా రీ ట్వీట్ అయింది. క్షణానికో కామెంట్ వచ్చింది.మోదీ నుంచి నిరంతర అప్ డేట్స్ కొనసాగాలని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు…నో సార్ అని కొన్ని వేల కామెంట్లు వచ్చాయి.. కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండిగానీ, పూర్తిగా వదిలేయవద్దు అని కూడా కామెంట్లు వచ్చాయి. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి, మోదీ వదిలేస్తే తామూ సోషల్ మీడియాను వదిలేస్తామని స్పష్టం చేశారు. ఇక నో సార్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది.

ఈ క్రింది వీడియో చూడండి

సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ చాలా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో 5.33 కోట్లమంది, ఫేస్‌ బుక్‌ లో 4.4 కోట్ల మంది, ఇన్‌ స్ట్రాగామ్‌ లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగివున్న టాప్ – 3 నేత, ఫేస్ బుక్ లో టాప్-2 నేత మోదీయే. అమెరికా అధ్యక్షుడు టొనాల్డ్ ట్రంప్‌ సైతం ఇటీవల ఈ విషయాన్ని ప్రస్తావించారు.అయితే రాజ‌కీయ కార‌ణాల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని కొంద‌రు కావాల‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అందుకే సోష‌ల్ మీడియా నుంచి దూరం అవ్వాలి అని అనుకుంటున్నార‌ని కొంద‌రు చెబుతున్నారు, అయితే దీని గురించి పీఎంవో నుంచి కూడా ఎలాంటి విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం లేదు..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation