జగన్ సంచలన నిర్ణయం.. AP కి కొత్త ఎలక్షన్ కమీషనర్ ?

స్థానిక సంస్థల ఎన్నికల సమయాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ కు మధ్య రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. దాంతో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మీద సీరియస్ అయ్యింది. ఏకంగా ఏపీ సీఎం జగన్ ప్రెస్ మీట్ మరీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు జగన్ ఎన్నికల కమిషనర్ పై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే… ముల్లును ముల్లుతోనే తీయాలని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ప్రాథమిక సూత్రాన్ని అనుసరించేలా కనిపిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించారని బలంగా విశ్వసిస్తోన్న వైఎస్ జగన్, సరికొత్తగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తన సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిని తెర మీదికి తీసుకుని రానున్నట్లు సమాచారం. రమాకాంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

Image result for AP కి కొత్త ఎలక్షన్ కమీషనర్

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. వైఎస్‌కు నమ్మకస్తుడిగా ఉన్నారు. పదవీ విరమణ చేసిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన తెలంగాణ క్యాడర్ కిందికి వెళ్లారు. అయితే ఇప్పుడు ఈయనను మళ్ళీ ఏపీకి తీసుకురావాలని జగన్ అనుకుంటున్నాడు. రమేష్ ను తీసేసి ఎలక్షన్ కమిషనర్ గా రమాకాంత్ రెడ్డిని నియమించాలని జగన్ అనుకుంటున్నాడంట. ఈయన అయితే జగన్ చెప్పినట్టు వింటాడని జగన్ అనుకుంటున్నాడు. అయితే ఈ ఎన్నికల తర్వాత ఈయనకు పదవి రావొచ్చు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక రమాకాంత్ రెడ్డి విషయానికి వస్తే.. వైఎస్ జగన్‌ పై నమోదైన ఆస్తుల కేసు వ్యవహారంలో రమాకాంత్ రెడ్డి తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడించారు. జగన్‌ పై నమోదైన ఏ ఒక్క కేసు నిలబడదని, తండ్రి హయాంలో ఆయన ఏనాడూ సచివాలయానికి కూడా రాలేదంటూ బాహటంగా మద్దతు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని వైఎస్ జగన్ తాజాగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రమే రమాకాంత్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో రమాకాంత్ రెడ్డి ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందున.. ఇప్పుడున్న పరిస్థితులపై ఆయన సలహాలను వైఎస్ జగన్ స్వీకరించినట్లు సమాచారం.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

Image result for ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడిన నేపథ్యంలో.. నిర్దేశిత గడువులోగా ఎలాగైనా ఎన్నికలను నిర్వహించడానికి ఎలాంటి మార్గాలను అన్వేషించాలనే విషయంపై రమాకాంత్ రెడ్డి.. వైఎస్ జగన్‌కు కొన్ని సలహాలను ఇచ్చారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై రమాకాంత్ రెడ్డి ముఖ్యమంత్రికి దిశానిర్ధేశం చేశారని అంటున్నారు.

హన్సిక హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation