టీడీపీకి కొత్త అధ్యక్షుడు?.. రేసులో పార్టీకి వీర విధేయుడు

159
Prev post

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. 1982 లో నందమూరి తారకరామారావు టీడీపీ పార్టీని స్థాపించాడు. ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. పార్టీని స్థాపించిన 6 నెలల్లోనే ఎన్నికలు రావడం, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాల తర్వాత టీడీపీ పార్టీ పగ్గాలు నారా చంద్రబాబు చేతిలోకి వచ్చాయి. ఇక అప్పటినుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడే ఉన్నాడు. టీడీపీ పార్టీ జాతీయ పార్టీ అయినా తర్వాత చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. కిమిడి కళా వెంకట్రావు ను ఏపీ అధ్యక్షుడిగా చేశాడు. అయితే ఇప్పుడు టీడీపీకి అధ్యక్షుడు మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీ ప్రక్షాళనపై చంద్రబాబు ఫోకస్ పెట్టారని, అందుకే పార్టీ అధ్యక్షుడిని మార్చాలని అనుకుంటున్నాడట. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న బాబు, కొన్ని మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారట. అందుకే ఏపీ టీడీపీ అధ్యక్షుడ్ని కూడా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని పేర్లను కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Image result for jr ntr

అధ్యక్షుడి రేసులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు బలంగా వినిపిస్తోందట. ఆయనైతే పార్టీ వాయిస్‌ ను బలంగా వినిపిస్తారని, మంత్రిగా పని చేయడం, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందని పార్టీ నేతలతో బాబు చర్చించినట్లు తెలుస్తోంది. అచ్చెన్న కూడా పార్టీ వాయిస్‌ ను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలరని, అధ్యక్ష పదవి ఇస్తే మంచి బూస్టప్ వస్తుందని పార్టీలో మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారట. ఇదిలా ఉంటే ఎర్రంనాయుడి ఫ్యామిలీ నుంచి ముగ్గురు కీలక పదవుల్లో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఎంపీగా, ఆయన సోదరి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా, అచ్చెన్నాయుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు.. కాబట్టి మళ్లీ ఆ కుటుంబానికే పదవి ఇస్తే విమర్శలమైనా వస్తాయా అని కూడా అధిష్టానం ఆలోచనలో పడిందంట. అందుకే అచ్చెన్నతో పాటూ మరో ఇద్దరు, ముగ్గురు పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు కూడా అంత యాక్టివ్‌గా లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీచేసి ఓడిపోయారు. మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా తక్కువగానే ఉన్నాయి.. పార్టీ వ్యవహారాల్లో కూడా అంత చురుకుగా లేరనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఆయన్ను తప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట. టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఇటీవలే మాజీ ఎమ్మెల్యే అనితను నియమించిన చంద్రబాబు, రాష్ట్రస్థాయి కమిటీతో పాటూ మరికొన్ని కీలక పదవుల్ని కూడా భర్తీ చేయాలని భావిస్తున్నారట. తెలుగు యువతతో పాటూ మరికొన్ని పదవులకు సంబంధించి కసరత్తు ప్రారంభించారట. రామ్మోహన్‌నాయుడికి యువత పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.. అలాగే పరిటాల శ్రీరామ్ పేరు కూడా రేసులో ఉంది. మిగిలిన పదవుల్ని కూడా త్వరలోనే భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారట. చూడాలి మరి పార్టీ ప్రక్షాళన కోసం చంద్రబాబు నాయుడు ఎవరెవరికి పదవులు అప్పజెప్పుతాడో.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation
Prev post