ఏప్రిల్12 మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని..

భారత్‌లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఎన్నో చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైర‌స్ స్ప్రెడ్ అవ్వకుండా.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. అధికారులతో, అన్ని రాష్ట్రాల సీఎంలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. తగిన చర్యలు తీసుకుంటున్నారు.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ జాక్వెలిన్‌

Ayodhya land dispute: No place for bitterness, fear, negativity in ...

అయితే ఈక్రమంలో వైర‌స్ పై యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను అభినందించేందుకు మార్చి 22న సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. అలాగే ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి దీపాలు లేదా కొవ్వుత్తులు, ఫ్లాష్ లైట్లు లేదా టార్చ్ లైట్లు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశ సమైక్యతను చాటిచెప్పేందుకు మోదీ పిలుపునివ్వగా.. ఈ రెండు కార్యక్రమాల్ని దేశ ప్రజలంతా విజయవంతం చేశారు.

టాప్ లెస్ ఫోటోషూట్‌లో అందాల విందు చేసిన కాజల్..

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మళ్లీ ఏ టాస్క్ ఇస్తారో అని దేశ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వైర‌స్ కట్టడి ఎంతో శ్రమిస్తున్న మోదీకి ప్రజలంతా కృతజ్ఞత చెప్పాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నెల 12వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా ఇంటి బాల్కనీల్లో నిలబడి ప్రధాని మోదీకి సెల్యూట్ చేయాలని కొందరు అభిమానులు పిలుపునిచ్చారు. దానికి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.ఈ విషయం కాస్తా ప్రధానమంత్రి దృష్టికి వెళ్లింది. దానిపై స్పందించిన మోదీ తనను నిజంగా ప్రేమించేవారు ఉంటే ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని.. ఇలాంటి ఫేక్ న్యూస్‌ కాకుండా ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Content above bottom navigation