కరోనా ఎఫెక్ట్ : రజినీకాంత్ రూ. 50 లక్షల విరాళం

116

కరోనా వైరస్ కారణంగా బీదా, గొప్ప, ఆడ, మగా తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. ఐతే.. కరోనాపై పోరాటానికి అందరూ చేతులు కలపాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ బారిన పడకుండా తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశంలో తీవ్రంగా నష్టపోతున్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోవడం వల్ల కొన్నివేల మంది సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇప్పుడు వాళ్లను ఆదుకోవడానికి తమిళ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పాపులర్ సినీ నటులంతా భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఫిల్మ్ ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) యూనియన్‌కు ఈ విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటికే సూర్య, ఆయన తమ్ముడు కార్తి రూ.10 లక్షల విరాళం అందజేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా రూ. 10 లక్షల విరాళం అందజేశారు. యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా రూ.10 లక్షలు ఇచ్చారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

Image result for rajinikanth and modi

ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ రూ. 50 లక్షల భారీ మొత్తాన్ని ప్రకటించారు. అందరి కన్నా ఎక్కువగా రజినీకాంత్ రూ. 50 లక్షలు విరాళం అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో మార్చి 16 నుంచి తమిళనాడులో షూటింగ్‌లు ఆపేశారు. అప్పటి నుంచి వేలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో FEFSI అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి స్టార్ హీరోలందరికీ ఒక విన్నపం చేశారు. 15000 మంది FEFSI వర్కర్లకు బియ్యం బస్తాలు సరఫరా చేయడానికి కోటి రూపాయలు అవసరమని చెప్పారు. అయితే, ఈ మొత్తంలో 50 శాతం రజినీకాంత్ ఒక్కరే డొనేట్ చేశారు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

ఇక టాలీవుడ్ నుంచి హీరో నితిన్ విరాలాన్నీ ప్రకటించాడు. కరోనా పై పోరాటానికి తన వంతు సాయంగా రూ.20లక్షలు విరాళంగా ప్రకటించాడు. కరోనా వైరస్ పరికరాల కోసం తెలంగాణ, ఏపీ ప్రభుత్వానికి చెరో రూ.10 లక్షలు విరాళం ప్రకటించాడు. ఎలాగైతే వరదలు, ఉత్పాతాలు సంభవిస్తే.. సెలబ్రిటీలు ఎలాగైతే ప్రభుత్వాలకు బాసటగా నిలిస్తారో.. తాజాగా ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌ను పారద్రోలడానికి అందరు ముందుకు రావాలని నితిన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చినట్టైయింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎన్నో లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇలాంటి సమయంలో కాస్త ధనవంతులు ప్రభుత్వాలకు చేతనైన సహాయం చేయాలి. ఇప్పటికే ఆనంద్ మహీంద్ర, రతన్ టాటా, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల అధిపతులు తమ వంతు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ముందు ముందు వేరే సెలబ్రిటీలు కూడా దేశాన్ని కబలిస్టున్న ఈ వైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వానికి తమ వంతు సాయం చేయడానికి ముందుకు రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

Content above bottom navigation