కరోనా ఎఫెక్ట్ .. ఏపీలో జూన్ 11 వరకు పాఠశాలలు క్లోజ్.!

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కోవిడ్ 19 ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ఆర్థికంగానూ నష్టం జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు ఉన్నట్లుండి భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 51 మందికి కోవిడ్ 19 పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 303కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇక రోజురోజుకు కోవిడ్ 19 కేసులు పెరగడంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖా కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. కోవిడ్ 19ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న సంగతి తెలిసిందే.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా

Can Jagan reply to media questions face to face on COVID-19?

ఈ నేపధ్యంలో కోవిడ్ 19 కట్టడి చేసేందుకు తదుపరి కార్యాచరణలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ ఎత్తివేసినా లేదా సడలించినా పాఠశాలలు తెరుచుకునే అవకాశం మాత్రం కనిపించట్లేదు. పాఠశాలలు తెరిస్తే విద్యార్ధులు గుమిగూడతారు కాబట్టి మూసివేయడమే మంచిదని ప్రభుత్వం ఆలోచిస్తోందట. అటు అకాడిమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. ఒకవేళ ఈ నెల 14 తర్వాత తెరిచినా.. ఆదివారాలు పోనూ కేవలం ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి. ఎలాగో 9వ తరగతి వరకు విద్యార్ధులను పరీక్షలు లేకుండా పాస్ చేసేశారు కాబట్టి.. జూన్ 11వ తేది వరకు స్కూళ్లను మూసి వేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న మౌని రాయ్

ఇక రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో కొత్తగా కర్నూలు జిల్లాలో 18 కరోనా కేసులు, నెల్లూరులో 8, పశ్చిమ గోదావరిలో 5, కడపలో 4, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా నమోదైన 37 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 303కు పెరిగింది. సోమవారం ఉదయం సైతం 14 కోవిడ్ 19 కేసులు వచ్చాయి. దీంతో సోమవారం ఒక్కరోజే మొత్తం 51 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఒక్క రోజు వ్యవధిలో 70 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. శనివారం వరకు నాలుగుగా ఉన్న కోవిడ్ 19 వైరస్ కేసులు ఒక్క సారిగా పెరిగిపోయాయి. దీంతో సోమవారం సాయంత్రానికి కర్నూలు జిల్లాలో మొత్తం కోవిడ్ 19 కేసులు 74కు చేరుకున్నాయి. కోవిడ్ 19 సోకిన బాధితులందరూ ఢిల్లీలోని నిజాముద్దీన్ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారుగా తెలుస్తోంది. అలాగే నెల్లూరు, గుంటూరులో సైతం భారీగా కేసులు పెరుగుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 74 కేసులు నమోదు కాగా, నెల్లూరులో 42 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో కలిసి కోవిడ్ 19 వైరస్ కేసులు 303 నమోదు కాగా, కేవలం ఐదు జిల్లాల్లోనే 204 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Content above bottom navigation