టీడీపీకి షాక్.. వైసీపీలోకి సీనియర్ ఎమ్మెల్యే, బాబు బెస్ట్ ఫ్రెండ్

90

రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం పార్టీలు కూడా నిత్యం ప‌దిలం కాదు..నేడు ఈ పార్టీలో ఉన్న నాయ‌కుడు రేపు వేరే పార్టీలో చేర‌చ్చు ఇది రాజ‌కీయ చ‌ద‌రంగం, నేత‌ల పావుల‌కి పార్టీలే బ‌ల‌వుతాయి.ఏపీలో ఇలాంటి రాజ‌కీయ క్రీడ సాగుతోంది.175 స్ధానాల్లో 151 సీట్లు వైసీపీ గెలిస్తే, కేవ‌లం టీడీపీ 23 సీట్లు గెలిచింది.వారానికో నాయ‌కుడు చొప్పున సైకిల్ దిగి ఫ్యాన్ చెంత‌కు చేరుతున్నారు.ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గుడ్ బై చెబితే మ‌రో టీడీపీ ఎమ్మెల్యే అదే దారిలో ఉన్నారు.ఇంత‌కీ ఆనాయ‌కుడు ఎవ‌రు ? ఎన్నిక‌ల వేళ ఈ రాజ‌కీయ క్రీడ ఎటు సాగుతుందో చూద్దాం.

Image result for karanam balaram

స్థానిక సంస్థల ఎన్నికలవేళ టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో కీలకమైన, సీనియార్టీ ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు.. గత నాలుగైదు రోజులుగా ఈ వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే రెహమాన్.. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు.. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇంఛార్జ్ రామసుబ్బారెడ్డిలు జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అలాగే పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ సతీష్‌రెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేశారు.. ఆయన కూడా త్వరలోనే వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరికి తోడు విశాఖ జిల్లా ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కూడా తెలుగుదేశంకు గుడ్ బై చెప్పారు. ఏ పార్టీలో చేరనని.. తన వ్యాపారం చూసుకుంటానని తేల్చి చెప్పారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కలరణం బలరామకృష్ణమూర్తి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నట్లు సమాచారం.

Image result for karanam balaram

కరణం బలరామకృష్ణమూర్తి గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆమంచికృష్ణమోహన్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. బలరాంకు చీరాల సొంత నియోజకవర్గం కాదు.. ఆయన అద్దంకి నుంచి పోటీ చేసేవారు. కానీ గతంలో టీడీపీలో ఉన్న ఆమంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లడంతో.. కరణంను చంద్రబాబు చీరాల పంపించారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన ఆయన కృష్ణమోహన్‌పై 17వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న బలరాం.. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు. అంతేకాదు అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది నేతల్లు ఈయన కూడా ఒకరు. ప్రకాశం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు.. రాష్ట్ర పార్టీలో కీలకమైన నేత కూడా. ఆయన 4 సార్లు ఎమ్యెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచారు.. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.

Image result for karanam balaram

మరోవైపు బలరాం వైఎస్సార్‌సీపీలో చేరితే చీరాలలో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్‌‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. చీరాల నియోజకవర్గంంలో సునీత, ఆమంచి వర్గాల మధ్య కాస్త గ్యాప్ ఉంది.. ఇప్పుడు బలరాం అధికార పార్టీగూటికి చేరితే.. అక్కడ మొత్తం మూడు వర్గాలుగా మారే ప్రమాదం లేకపోలేదు. మరి ఈ ముగ్గురు నేతల్ని వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆమంచి కరణం బలరాం రాకను స్వాగతిస్తారా లేదా అన్నది చూడాలి. అంతేకాదు భవిష్యత్‌లో చీరాల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. బలరాం వైఎస్సార్‌సీపీలోకి వెళితే.. ఆయన కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్ పరిస్థితి ఏంటన్నది చూడాలి. దీంతో ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఈ క్రింది వీడియో చూడండి

కరణం అధికార పార్టీలో చేరితే అద్దంకి రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. బలరాం సొంత నియోజకవర్గం అద్దంకి.. అక్కడి నుంచి పోటీచేసి ఆయన గెలుస్తున్నారు. 2009 వరకు బలరాం అక్కడి నుంచి పోటీచేశారు.. 2014లో మాత్రం కుమారుడు వెంకటేష్‌ను బరిలోకి దించారు. తర్వాత రాజకీయ సమీకరణాలు మారడంతో.. వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ టీడీపీ గూటికి చేరారు. దీంతో బలరాం పార్టీలో సీనియర్ నేత కావడంతో చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తర్వాత కూడా గొట్టిపాటి-బలరాం వర్గాల మధ్య యుద్ధం నడిచింది. రెండు మూడు సందర్భాల్లో రెండు వర్గాలు బాహాబాహీకి దిగారు. అంతేకాదు ఓ గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు చనిపోయారు. తర్వాత ఆమంచి వైఎస్సార్‌సీపీకి వెళ్లడం.. కరణం చీరాలకు వెళ్లారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఆమంచిపై విజయం సాధించారు. బలరాం పార్టీ మారితే చీరాలతో పాటూ అద్దంకిలో వైఎస్సార్‌సీపీని బలోపేతం అవుతుందని నేతలు భావిస్తున్నారు.ఇక కుమారుడు వెంక‌టేష్ కు రాజ‌కీయంగా ఎమ్మెల్యేగా చూడాలి అని అనుకున్నారు బ‌ల‌రాం…కాని అది కూడా అవ్వ‌లేదు.. అయితే ఒంగోలు మేయ‌ర్ ప‌ద‌వి ఇప్పుడు జ‌న‌ర‌ల్ కు వ‌చ్చింది, దీంతో ఈ ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి మేయ‌ర్ ప‌ద‌వి వ‌స్తుంది అని ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation