మోదీ చెప్పిన లైట్లు ఆర్పి దీపం వెలిగించడం’ వెనుక ఉన్న సైన్స్ ఇదే..

146

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు జాతినుద్దేశించి మరోసారి మాట్లాడారు. ఓ వీడియో సందేశాన్ని ఆయన ప్రజలకు పంపారు. అందులో ప్రధానమైన విషయం ఏంటంటే, ఈనెల 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటలకు మన ఇళ్లలో లైట్లు అన్నీ ఆర్పేసి.. 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు వెలిగించాలని, లేకపోతే మొబైల్ ఫ్లాష్ లైట్లు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఉన్న సైన్స్ గురించి తెలియజేశారు ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్. ‘ప్రధాని మోదీ పిలుపుకి ఓ అర్థం ఉంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

యోగ వశిష్ట చాప్టర్ 6లో ద ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ కాన్షియస్నెస్ అని ఉంటుంది. ప్రపంచంలో 5 శాతం మంది ఎలా ఆలోచిస్తారో, 95 శాతం మంది దాన్ని అనుసరిస్తారు. అలాగే, మన శరీరంలోకి కరోనా వైరస్ను రానివ్వకుండా చేసే శక్తి మనలోనే ఉంటుంది. క్వాంటమ్ సిద్ధాంతం, రిథంభర సిద్ధాంతం ప్రకారం అందరం కలసి ఒక్కటిగా ఆలోచించి, ‘మనకు కరోనా వైరస్ సోకవద్దు’ అని సంకల్పం తీసుకుంటే ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ దాన్ని అమలు చేస్తుంది. (ఓరకంగా మనం ఏదైతే జరగాలని బలంగా కోరుకుంటామో అది కచ్చితంగా జరుగుతుంది.)’ అని డాక్టర్ కేకే అగర్వాల్ చెప్పారు. కాబట్టి, ఒకే రోజు ఒకే సమయానికి అందరం కలసి సంకల్పం తీసుకుందామని, ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్టు పాటిద్దామని డాక్టర్ కేకే అగర్వాల్ సూచించారు.

Content above bottom navigation