అమెరికా లో దిగగానే మోడికి వెన్నుపోటు పొడిచిన ట్రంప్

రెండురోజుల పాటు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చాలా విజయవంతంగా సాగింది. భారత్ లో అడుగు పెట్టిన ఆ క్షణం నుండి డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీ ని పొగుడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 24వ తారీఖున విమానం దిగి భారత అశేష జనవాహిని తో స్వాగతం అందుకున్న డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ స్టేడియంలో ప్రసంగించారు. తన ప్రసంగంలో భారత ప్రజలను మరియు మోడీని అదేవిధంగా ఇంకా అనేక విషయాల గురించి చాలా అనుకూలంగా మాట్లాడటం జరిగింది. అయితే లక్షలాది మంది ప్రజలు ట్రంప్ కు స్వాగతం పలికారు ఇది భారతీయులు తనకు ఇచ్చిన గౌరవంగా ట్రంప్ భావించారు, అయితే ఆయన భారత పర్యటన గురించి ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూశాయి, పాకిస్తాన్ కూడా భారత్ గురించి ట్రంప్ ఏం మాట్లాడతారు అని చూసింది, అయితే ట్రంప్ కూడా చాలా తెలివిగా వ్యవహరించారు, రాజకీయ నాయకులతో పారిశ్రామిక వేత్తలతో సీఈవోలతో సీఎంలతో ఉన్నత ఉద్యోగులతో భారత అమెరికా విదేశీ రాయబారులతో ముచ్చటించారు.

Image result for trump india tour

ఇదే సందర్భంలో భారత్ తో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని…మోడీకి నాకు మంచి బాండింగ్ ఏర్పడిందని డోనాల్డ్ ట్రంప్ తాజా పర్యటన ఉద్దేశించి మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. ఇండియా తో అనేక ద్వైపాక్షిక మరియు పెట్టుబడులు అగ్రిమెంట్లు చేసుకున్న డోనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా వెళ్లడం జరిగింది. కాగా అమెరికాలో విమానం దిగగానే మోడీ తన అసలు రంగు బయటపెట్టినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

అమెరికా కి భారత్ కంటే పాకిస్థాన్ చాలా మిత్ర దేశం. పాకిస్తాన్ ఆయుధాలను ఎక్కువగా అమెరికా దగ్గర కొంటుంది. ఇటువంటి తరుణంలో భారత్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాడికల్ ఇస్లాంని మరియు టెర్రరిస్టులను ప్రోత్సహించేది లేదని మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్లేసరికి పాకిస్తాన్ తన మిత్ర దేశం అని భారత్ మరియు పాకిస్తాన్ దేశానికి సమస్యగా ఉన్న కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానని డోనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది ఖచ్చితంగా మోడీ కి వెన్నుపోటు పొడిచినట్టు అని ఇంటర్నేషనల్ మీడియా సంస్థ డోనాల్డ్ ట్రంప్ వ్యవహారాన్ని అభివర్ణించింది. అయితే భారత్ లో కూడా ట్రంప్ ఈ మాటలు అన్నారు .. రెండు దేశాలు అమెరికాకి కావాలి, వారికి బిలియన్ డాలర్ల ఆయుద వ్యాపారం ఈ రెండు దేశాలతో అవసరం.. అందుకే ఇటు కర్ర విరక్కుండా పాము చావకుండా ట్రంప్ తెలివిగా వ్యవహరించారు.భారత్ వచ్చిన సమయంలో ఇక్కడ కూడా అదే అన్నారు.. పాక్ భారత్ మధ్య కాశ్మీర్ అంశాన్ని కావాలంటే చర్చించి పరిష్కరిస్తాం అన్నారు, సో భారత్ సోమ్ముతో సత్కారాలు చేస్తే, పాకిస్ధాన్ పై ప్రేమ వలగపోవడం ఏమిటి అని చాలా మంది విమర్శలు చేశారు. మరి చూడాలి ట్రంప్ వచ్చే రోజుల్లో ఇంకెన్ని మాటల తూటాలు వదులుతారో.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation