తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే

134

ఈ మ‌హ్మారి వైరస్ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుంది. మొదట్లో కొంత కంట్రోల్ లోకి వచ్చింది అని అనుకున్నప్పటికీ మర్కజ్ ఘటన బయటపడిన తరువాత రోజురోజుకి పాజిటివ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డన్ ఆఫ్ వంటివి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం పాజిటివ్ గా వెల్లడైన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు – సోకేందుకు అనుమానం ఉన్న వారిని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా – కరోనా బాధితులను కలిసి ఉండటం వంటి అంశాలతో హోమ్ క్వారంటైన్ లో ఉంచడమో లేక ప్రభుత్వ క్వారంటైన్ లకు తరలించడం వంటివి చేస్తున్నారు.

Telangana CM KCR seeks PM's intervention for supply of gunny bags ...
బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

అలాగే పాజిటివ్ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం – జలుబు – ఇతరత్రా కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి రక్త నమూనాలని తీసుకోని – ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్ ఉన్నదీ తెలుసుకుంటారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా – ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు నిర్వహించే కార్డన్ ఆఫ్ వంటివి చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే ఒకే ప్రాంతంలో పది అంతకంటే ఎక్కువ పాజిటివ్ కేసులున్న ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించనున్నారు. ఇలా గుర్తించిన హాట్ స్పాట్ ల ద‌గ్గ‌ర మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. అయితే ఎన్ని పాజిటివ్ కేసులు ఒకే దగ్గర ఉంటే – వాటిని హాట్ స్పాట్లుగా గుర్తించాలనే అంశంపై ఇంకా ఒక్క స్పష్టతకి రాలేదు. ఇక వైర‌స్ కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలకి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ రాత్రి – పగలు అన్న తేడా లేకుండా నిత్యం పోలీస్ – వైద్య అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మర్కజ్ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్ పనులు వేగంగా చేస్తున్నారు.

Content above bottom navigation