కరోనా కట్టడిలోనూ నెంబర్ 1: తెలంగాణ కెసిఆర్ సంచలన నిర్ణయాలు

వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలతో ఒక్కసారిగా కేసులు పెరగడంతో దేశంలో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. తబ్లిగీ సభ్యులతో దేశంతోపాటు తెలంగాణలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రార్థనలకు వెళ్లిరావడంతో వారి వలన వైరస్ తీవ్రమవుతోంది. కేసులు పెరుగుతుండంతో దానిక తగ్గట్టు దాని నివారణకు పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తీసుకుంటున్న చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. వైరస్ నివారణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిరంతరం శ్రమిస్తున్నారు. దీని కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా కృషి చేస్తోంది.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా

Telangana CM KCR seeks PM's intervention for supply of gunny bags ...

ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 350కి కేసులు చేరుకున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ నిరంతరం వైరస్ పై సమీక్ష చేస్తున్నారు. కట్టడికి అమలవుతున్న కార్యక్రమాలు – బాధితులకు అందుతున్న వైద్య సేవలు.. హోం క్వారంటైన్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్య శాఖను మరింత అప్రమత్తం చేశారు. వైరస్ వ్యాప్తి – నివారణ చర్యలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు.ఒకేసారి లక్షమంది బాధితులకు వైద్యం అందించేలా సౌకర్యాలు – సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. బాధితులకు కావాల్సిన మందులు – వైద్య పరికరాలు – వెంటిలేటర్లు – పేషంట్లు – వైద్యులు – సిబ్బందికి అవసరమైన ప్రత్యేక దుస్తులను పెద్ద మొత్తంలో సేకరిస్తున్నారని సమాచారం. దీనిలో భాగంగా ఏకంగా రూ.12 కోట్ల విలువైన పీపీఈ కిట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.రూ.20 కోట్లు వెచ్చించి ఫ్లూయిడ్స్ ని కోనుగోలు చేసిందంట. మరో లక్ష పీపీఈ కిట్ల ఉత్పత్తిని స్థానికంగానే తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కేవలం రెండున్నర గంటల్లోనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగల 500 టెస్టింగ్ కిట్లను కోనుగోలు చేసింది. ఒక్క కిట్ సాయంతో 100మందికి టెస్ట్ చేయటానికి ఉపయోగపడుతుంది. 500 కిట్లతో మొత్తం 50వేల మందికి వైర‌స్ టెస్ట్ లు చేయగలుగుతాము. వీటితో పాటు వెంటలేటర్లు కూడా ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం 500 వెంటిలేటర్లకు ఆర్డర్ చేసిందంట.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న మౌని రాయ్

డీఆర్ డీ అనుసంధానంతో మరో 500 వెంటిలేటర్లు – ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ – వెంటిలేటర్ల కోసం అనుమతి కోరినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది మెదక్ జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వెయ్యి వెంటిలేటర్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే ఇవన్నీ రోగులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 2200 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వైద్య చికిత్సలో ఉపయోగించే ప్రధాన డ్రగ్స్ ని కూడా ప్రభుత్వం పెద్దమొత్తంలో కోనుగోలు చేస్తోందంట. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వైర‌స్ నివారణకు కట్టుదిట్టమైన చ‌ర్య‌లు తీసుకుంటోంది.

Content above bottom navigation