నారా బ్రాహ్మణి వైయస్ భారతి వీళ్ల ఇద్దరి గురించి తెలిస్తే మతిపోతుంది

నారా బ్రాహ్మణి వైయస్ భారతి ఇద్దరూ గొప్ప ఇంటి ఆడబిడ్డలు పెద్ద ఇంటి కోడల్లు భర్తలు రాజకీయాల్లో బీజీగా ఉంటే వారి కుటుంబాలని చూసుకుంటున్న భార్యమణులు ఇద్దరిది వేరు వేరు కుటుంబాల బ్యాగ్రౌండ్ కాని రాజకీయ నేతలకు భార్యలుగా వచ్చారు.వైయస్ భారతి ఏపీ ముఖ్యమంత్రి జగన్ భార్య.నారా బ్రాహ్మణి ఏపీ మాజీ మంత్రి నారాలోకేష్ సతీమణ.అయితే కుటుంబాలు చూసుకుంటే ఇటు నారా బ్రాహ్మణి నందమూరి వారి ఇంటి అమ్మాయి, నారా వారి ఇంటికి కోడలుగా వచ్చింది. ఇక భారతిని చూస్తే డాక్టర్ల కుటుంబం నుంచి ఇటు రాజకీయ నేతల వారి కుటుంబానికి వచ్చిన అమ్మాయి.వైయస్ భారతి తండ్రి గంగిరెడ్డి తల్లి సుగుణమ్మ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా డాక్టర్లు కావడంతో ఆమెని కూడా బాగా చదివించారు ..బిజినెస్ అడ్మినిస్ట్ర్రేషన్ లో మాస్టర్స్ చేశారు భారతి, ఇక తండ్రి తల్లి కడప జిల్లాలో చాలా పెద్ద పేరు ఉన్న డాక్టర్లు కావడంతో వారి కుటుంబానికి అక్కడ డాక్టర్ ఫ్యామిలీ అనే పేరు ఉంది.

Image result for నారా బ్రాహ్మణి వైఎస్ భారతి

అలా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆమె వివాహం చేసుకున్నారు, వివాహం చేసుకున్నాక పూర్తిగా కుటుంబానికే ఆమె సమయం కేటాయించారు, తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో, భర్త జైలుకి వెళ్లడంతో ఆమె వ్యాపారాలు చూసుకోవలసి వచ్చింది, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఆమె తీసుకున్నారు..ఈ సమయంలో సాక్షి అలాగే సిమెంట్ ఫ్యాక్టరీల వ్యాపారాలు అన్నీ ఆమె చూసుకున్నారు, తర్వాత రాజకీయాల్లో జగన్ బిజీగా ఉన్నా తన ఇద్దరు పిల్లల చదువు బాధ్యతలు కూడా ఆమె చూసుకున్నారు.గొప్ప ఇంటి నుంచి పెద్ద ఫ్యామిలీకి వచ్చి ఆ కుటుంబ బాధ్యతని ఆమె మోస్తున్నారు అనే చెప్పాలి. ఇక భర్తకి రాజకీయంగా చాలా సాయం చేశారు, పులివెందులలో భర్త తరపున ప్రచారం కూడా చేశారు, ఇక భర్త సీఎంగా బిజీగా ఉండటంతో ఆమె మొత్తం వ్యాపారాలు అన్నీ చూసుకుంటున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక నారా బ్రాహ్మణి, తండ్రి బాలయ్య తల్లి వసుంధరా దేవి.. ఇటు పుట్టిన ఇల్లు సినిమా రాజకీయ నేపథ్య కుటుంబం.. అటు అత్తగారి కుటుంబం కూడా పూర్తిగా రాజకీయ కుటుంబం.. అయినా ఆమె రాజకీయాల్లోకి రాలేదు.. ఆమె వ్యాపారానికి పరిమితం అయ్యారు, 2007 లో బ్రాహ్మణి లోకేష్ కు వివాహం జరిగింది, తర్వాత బాబు పుట్టాక భర్త లోకేష్ సలహాతో ఆమె హెరిటేజ్ వ్యాపారం చూసుకుంటున్నారు. ఇలా ఇరువురు వ్యాపారాలతో బీజీగా మారిపోయారు, రాజకీయాలకు ఇద్దరూ దూరంగానే ఉంటారు అని చెప్పాలి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation