10 వ తరగతిలోనే పెళ్లి చేసుకున్న కేసీఆర్

తెలంగాణ ఉద్య‌మం అంటే కేసీఆర్ కు ముందు కేసీఆర్ త‌ర్వాత అనేలా కేసీఆర్ ఉద్య‌మాన్ని న‌డిపించారు.
చ‌చ్చి అయినా ప్ర‌త్యేక తెలంగాణ సాధిస్తా అని నిన‌దించిన నాయ‌కుడు కేసీఆర్. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం చావు చివ‌ర వ‌ర‌కూ వెళ్లి వ‌చ్చిన గులాబీ నాయ‌కుడు కేసీఆర్.విద్యార్దుల ఉద్యోగులు స‌క‌ల జ‌నుల‌ని ఏకం చేసి తెలంగాణ గ‌డ్డ‌పై , జోరుగా తెలంగాణ నినాదం ఎలుగెత్తి చాటిన నాయ‌కుడు కేసీఆర్ అందుకే కేంద్రం దిగింది.
కాంగ్రెస్ కేసీఆర్ డిమాండ్ల‌కు ఒప్పుకుంది.పార్ల‌మెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయింది.ఆంధ్రా తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి.అనుకున్న‌ది సాధించిన కేసీఆర్ కు తెలంగాణ ప్ర‌జ‌లుబ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.
ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ ఎస్ కు కేసీఆర్ నాయ‌కత్వమే మాకు కావాలి అని సీఎం ని చేశారు. ప్ర‌జ‌లు
రెండు సార్లు గులాబీ జోరు కొన‌సాగి ఆయ‌న సీఎంగా కొన‌సాగుతున్నారు.తెలంగాణ‌లో ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తూ దేశంలో నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు.

Image result for kcr and his wife

అలాంటి కేసీఆర్ గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుందాం.

కేసీఆర్ మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి,1954 న రాఘవరావు,వెంకటమ్మ దంపతులకు జన్మించారు కేసీఆర్.ఉస్మానియా వర్శిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. ఆయ‌న‌కు మాధ్స్ సైన్స్ కంటే తెలుగు ఇష్టం ప‌ద‌వ త‌ర‌గ‌తి అయ్యాక 1969లో కేసీఆర్ వివాహం చేసుకున్నారు.. దూర‌పు బంధువుల అమ్మాయినిచ్చి ఆయ‌న‌కు వివాహం జ‌రిపించారు.. ఆయ‌న‌కు తొమ్మిది మంది అక్క చెల్లెలు ఓ అన్న ఉన్నారు, ఇక కేసీఆర్ భార్య శోభ కుటుంబం కూడా చాలా పెద్ద‌ది ఆమె తండ్రి కేశ‌వ‌రావు ఆయ‌న స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు.. నిజాంకు వ్య‌తిరేకంగా పోరాటం చేశారు.. అందుకే ఆయ‌న చాలా మందికి సుప‌రిచితులు. ఇక ఇంటి ద‌గ్గ‌ర ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుకుంటూ త‌న అన్న‌కు పొలం ప‌నుల‌కి కేసీఆర్ సాయం చేసేవారు.

Image result for kcr and his wife

ఇంట‌ర్ కు రాగానే స‌మాజంపై అవ‌గాహ‌న వ‌చ్చింది ఇక రాజ‌కీయ స‌భ‌ల‌కు వెళ్లేవారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ ధీటుగా ఎదుర్కొన్నారు, డిగ్రీతో పాటు ఆయ‌న హిందీ ఉర్దూ బాగా నేర్చుకున్నారు, త‌ర్వాత ఇంగ్లీష్ పై ప‌ట్టు బాగా సంపాదించారు. ఉస్మానియాలో చ‌దువుకునే స‌మ‌యంలో ఆయ‌న రాజ‌కీయాల‌పై ఆస‌క్తి పెంచుకున్నారు. ఆస‌మ‌యంలో కాంగ్రెస్ బ‌లంగా ఉంది , యూత్ కాంగ్రెస్ జోరు మీద ఉంది, దానిని సంజ‌య్ గాంధీ ముందుండి న‌డిపిస్తున్నారు…1976లో సంజ‌య్ గాంధీ నాయ‌క‌త్వంలో యూత్ కాంగ్రెస్ లో చేరారు… త‌ర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టాక తెలుగుదేశంలో1983లో కేసీఆర్ చేరారు.కేసీఆర్ దంపతులకు ఒక కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు,కుమార్తె కల్వకుంట్ల కవిత…తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.1987-88 మధ్య కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.1999 నుంచి 2001 వరకు ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్‌గా పనిచేశారు.ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశారు.

Image result for kcr and his wife

2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.14వ లోక్ సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోకసభ సభ్యులన్న టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ మంత్రి పదవి పొందారు.2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మికశాఖ మంత్రి పదవిని నిర్వహించారు. త‌ర్వాత మంత్రిపదవులకు రాజీనామా చేయడమే కాకుండా యూపీఏ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు.ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కేసీఆర్అ నంతరం జరిగిన ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై రెండు లక్షలకుపైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో 2008లో మళ్లీ రాష్ట్రమంతటా టీఆర్ఎస్ సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి లక్షా 50 వేల పైగా మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు.ఆ తర్వాత 2009లో జరిగిన 15వ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు.కాగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు వంటి పరిణామానాలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు కేసీఆర్.తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచారు.2009,నవంబర్ 29న నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టారు.దీనిని దీక్షా దివస్‌గా పేర్కొన్నారు.ఈ క్రమంలో తెలంగాణ పోరాటం ఉధృతం కావడంతో ఇక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం 2009,డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.2014 జూన్ 2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. మ‌రి కేసీఆర్ సాధించిన విజ‌యం పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation