నా వెనుక ఏం జరుగుతుంది…? ఆందోళనలో చంద్రబాబు…!

ఆంధ్రప్రదేశ్ లో ఐటి దాడుల హడావుడి నెలకొంది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు ఇళ్ళపై ఢిల్లీ ఐటి బృందం ఏకకాలంలో దాడులు చేసింది. పలువురు టీడీపీ సీనియర్ నేతల ఇళ్ళపై ఏకకాలంలో దాడులు జరిగాయి. ప్రధానంగా చంద్రబాబు సన్నిహితుల ఇళ్ళపై ఐటి అధికారులు విరుచుకుపడ్డారు. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఐటి అధికారులు సోదాలు చేసారు. ఉదయం నుంచి చంద్రబాబు మాజీ పిఏ శ్రీనివాస్ పై కూడా ఐటి దాడులు జరిగాయి. ఆయన 2019 వరకు చంద్రబాబు పిఏగా ఉన్నారు. డీ నరేష్ చౌదరి ఇళ్ళపై కూడా సోదాలు చేసారు. సిఆర్పిఎఫ్ బలగాల పహారాలో అధికారులు సోదాలు చేశారు. అదే విధంగా నవయుగ సంస్థ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. అలాగే చంద్రబాబు కుమారుడు లోకేష్ సన్నిహితుల మీద ఐటి దాడులు జరుగుతున్నాయి. పార్టీ కీలక నేతగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు సహా మరికొందరు నేతల మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. విద్యుత్ శాఖలో పనులు చేసిన కాంట్రాక్టర్ల మీద కూడా జరుగుతున్నాయి. ఇలా చంద్రబాబుకి అత్యంత సన్నిహితుల ఇళ్లనే టార్గెట్ చేసారు.

Image result for chandra babu

హైదరాబాద్ లో ఉండే తన సన్నిహితుల మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత నాలుగు రోజులుగా మీడియాలో ఎక్కువగా వస్తున్న వార్తలు ఇవే. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామం ఇబ్బందిగా మారితే, ఆ పార్టీ అధినేత చంద్రబాబులో మాత్రం ఆందోళనకు కారణంగా మారినట్టు తెలుస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత తనకు వచ్చే ఇబ్బందులు ఏమీ లేవని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం భయపడే పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇప్పుడు ఒక్కొక్కటి ఆయన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ ఐటి సోదాలు అన్ని కూడా స్థానిక అధికారులకు కూడా సమాచారం లేకుండా జరుగుతున్నాయి. దీనితో ఇప్పుడు చంద్రబాబులో ఆందోళన మొదలయింది. బాలకృష్ణ చిన్న అల్లుడు మీద కూడా బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే అసలు తన వెనుక ఏం జరుగుతుంది అనే భయంలో ఉన్నాడు చంద్రబాబునాయుడు. తనను టార్గెట్ చేసింది ఎవరు అనే దాని మీద చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ఈ పరిణామం నుంచి ఏ విధంగా బయటపడాలి అనే దాని మీద చంద్రబాబు ఇప్పుడు తీవ్ర మధన పడుతున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్ళు పరిస్థితులు అన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని భావించిన బాబు, ఇప్పుడు కేంద్రంలో తనకు సన్నిహితంగా ఉండే బిజెపి నేతల ద్వారా ఏం జరుగుతుంది అనే ఆరాలు తీస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ పరిణామం నుంచి చంద్రబాబు ఎలా బయటపడతాడో.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation