Breaking News :వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా జగన్ సంచలన నిర్ణయం

వైసీసీ ఈసారి ఎన్నిక‌ల్లో భారీగా విజ‌యం సాధించింది… అయితే గెలిచిన ఎమ్మెల్యేలు చాలా వ‌ర‌కూ పార్టీకి నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేస్తున్నారు, అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న త‌గాదాలు ద్వితీయ‌స్ధాయి కేడ‌ర్ తో వ‌చ్చినా పార్టీ అధిష్టానం చాలా వ‌ర‌కూ వాటిని సాల్వ్ చేస్తోంది, అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం సీఎం జ‌గ‌న్ తో ఏ విష‌యం చ‌ర్చించ‌కుండా కొన్ని కామెంట్లు చేస్తున్నారు, అవే పార్టీకి ఇప్పుడు పెద్ద మైన‌స్ గా అవుతున్నాయి, తాజాగా ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో ప్ర‌భుత్వంలో ప్ర‌కంప‌న‌లు రేపాయి.

Image result for అంజాద్ బాషా

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌర సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ తీర్మానం చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గుంటూరు నగరంలో వైసీపీ సింహగర్జన సదస్సులో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా సీఎం జగన్‌ వ్యవహరించబోరన్న నమ్మకం తనకుందని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

కాగా సీఏఏ, ఎన్ఆర్‌సీపై ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కూడా కీలక ప్రకటన చేశారు. సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వైసీపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.తనకు పదవులు, పార్టీ ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యని అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీపై ముందుకెళ్తే అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని వెల్లడించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒప్పిస్తానని స్పష్టం చేశారు. ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధంచి ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్లబోదని, ఈ విషయంలో తనను నమ్మాలని కోరారు. అయితే దీనిపై వైసీపీ స్టాండ్ ఎలా ఉందో చూడాలి, అప్పుడు ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు కామెంట్లు చేయాలి.. అంతేకాని ఇలా మాట్లాడ‌టం ఏమిటి అని పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా కొంద‌రు భావిస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation