వైసీపీ ఫైర్ బ్రాండ్ బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డిపై కేసు నమోదు..

ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా కొనసాగుతోంది. పోలీసులు, అధికారులు సమన్వయంతో ప‌నిచేస్తూ మ‌హ‌మ్మారి వైర‌స్ ను రాష్ట్రం నుంచి త‌రిమికొట్టేందుకు అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తున్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మిన‌హా ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌ ధరించడం, భౌతిక‌ దూరం పాటించడం వంటివి చేయాల‌ని ప్ర‌జ‌ల‌ను ప‌దే, ప‌దే హెచ్చ‌రిస్తున్నారు. మాట విన‌కుండా అన‌వ‌స‌రంగా రోడ్లపైకి వ‌చ్చేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ విష‌యంలో పొలిటిషియ‌న్స్ ని కూడా వ‌ద‌ల‌డం లేదు పోలీసులు.

Byreddy Siddharth Reddy Wiki, Biography, Political career, Family ...
సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై.. నందికొట్కూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఆదివారం హైపో ద్రావణం స్ప్రే చేసేందుకు వచ్చిన వారు లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించారని, భౌతిక దూరం పాటించ‌కపోవ‌డంతో, నేత‌ల‌తో పాటు వారి అనుచరులుపైనా కేసు నమోదు చేశారు. ఇక ఇదే విష‌యానికి సంబంధించి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. లాక్‌ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు కేసు ఫైల్ చేశారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిందేనని.. ఒకవేళ పట్టించుకోకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అంతేగా మరి.. బ్రిటన్ లో ప్రధానికే కరోనా వచ్చింది.. మనకు రాదా? ఏంటి? అందుకే లాక్ డౌన్ లో ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంది ఆరోగ్యంగా ఉండండి.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

ఇక ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కూడా లాక్‌డౌన్ కొనసాగుతుంది. అధికారులు, పోలీసులు పక్కాగా నిబంధనల్ని అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఒకవేళ బయటకు వచ్చిన మాస్క్ ధరించి సామజిక దూరంగా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు.. ఇంకా అనవసరంగా రోడ్డుపైకి వచ్చి షో చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా అక్కడక్కడా వాహనాలను సీజ్ చేస్తున్నారు కూడా. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి.

Content above bottom navigation