వైయస్ రాజా రెడ్డి రియల్ స్టోరీ

కడప జిల్లాలోని బలపనూరు గ్రామం.. అక్కడ రైతు వైయస్ వెంకటరెడ్డి ఉండేవారు.. ఆయనకు ఇద్దరు భార్యలు మొదటి భార్యకు పది మంది సంతానం.రెండో భార్యరు ఒక కుమారుడు. మొదటి భార్య సంతానంలో ఓ కుమారుడే వైయస్ రాజారెడ్డి ..మిగిలిన వారు 9 మంది అమ్మాయిలే.. ఇలా వైయస్ రాజారెడ్డి జన్మించారు. ఈ సమయంలో వైయస్ వెంకటరెడ్డి చాలా బీద స్దితిలో ఉన్నారు , సాధారణ రైతుగా తన పిల్లలని పోషించుకునేవారు.ఈ సమయంలో కడప మీదుగా ముంబై రైల్వేలైన్ పడింది.. ఈ సమయంలో క్ర్తైస్తవం చాలా బాగా విస్తరించింది, అప్పుడు వెంకటరెడ్డి తన కుటుంబం అంతా కలిసి క్రైస్తవం తీసుకున్నారు. ఇలా వెంకటరెడ్డి పరమతం తీసుకోవడంతో గ్రామంలో ఆయనని అందరూ పక్కనపెట్టారు, దీంతో కుటుంబానికి దూరంగా ఆయన పులివెందుల చేరుకున్నారు. అక్కడ మిషనరీ స్కూల్లో గంట కొట్టే పనికి చేరారు. అలా తండ్రి సంపాదనతో బాగా చదువుకున్నారు పిల్లలు.

Image result for raja reddy

ఇక రాజారెడ్డి కూడా అందరిలో చాలా డిఫరెంట్ గా ఉండేవారు, ఇలా చిన్నస్ధాయి కాదు పైస్ధాయికి రావాలి అని కోరుకునేవారు. రాజారెడ్డి నెమ్మదిగా ఎదిగిన క్రమంలో క్రైస్తవ మిషనరీ కాంట్రాక్టులు చేపట్టారు. అలా సంపాదించన సొమ్ముతో పులివెందుల జమ్మలమడుగు కడపలో చాలా వరకూ భూములు కొన్నారు, ఇలా పెద్ద భూస్వామిగా ఆయన మారారు, పలు కాంట్రాక్టులు చేసేవారు. ఆ సమయంలో ఆయనకంటూ సపరైట్ సైన్యం రెడీ చేసుకున్నారు.అలా పులివెందుల చుట్టు పక్కల గ్రామాలకు పెద్ద మనిషిగా అయ్యారు. ఈ సమయంలో మంగం పేట బైరైటస్ గనులులో వెంకటసుబ్బయ్య దగ్గర భాగస్వామిగా రాజారెడ్డి మారారు, తర్వాత వెంకటసుబ్బయ్య మరణించాడు. అయితే వెంకటసుబ్బయ్య కుమారులు మాత్రం రాజారెడ్డిపై విమర్శలు చేసేవారు. తర్వాత బైరైటస్ గనులు ఆయన సొంతం అయ్యాయి. ఇక తనలా కాకుండా తన పిల్లలు బాగా చదువుకోవాలి అని అనుకునేవారు, అందుకే రాజారెడ్డి తన పిల్లలని అందరిని బాగా చదివించారు, ఆడపిల్లలని కూడా ఆయన చదివించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ సమయంలో ఆయన కుమారుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని గుల్బార్గాలో మెడిసన్ చదివించారు.. తర్వాత రాజశేఖర్ రెడ్డి మిషనరీ ఆస్పత్రిలో డాక్టర్ గా మారారు.. అప్పుడు పులివెందులలో ఆయన చెప్పిందే వేదం అనేలా మారింది, తర్వాత ఆయన చేత పులివెందులలో ఆస్పత్రి కూడా ఏర్పాటు చేశారు రాజారెడ్డి, ఇలా ఆయన జిల్లాలో ఎంతో పేరు సంపాదించారు, ఈ సమయంలో ప్రత్యర్దులు కూడా రాజారెడ్డికి పెరిగిపోయారు.పలు గొడవలు వివాదాల్లో రాజారెడ్డి చిక్కుకోవడంతో అప్పటి జిల్లా కలెక్టర్ మీరు బయట ఉండటం సేఫ్ కాదు అని చెప్పారు, దీంతో ఆయన సంవత్సరం పాటు జైలులో ఉన్నారు, తర్వాత సంవత్సరం ఆయన బయటకు వచ్చారు, అప్పుడే ఆయన రాజకీయంగా మనకు అండ ఉండాలి అని భావించి తన కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.1978లో వైయస్ ఆర్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా నిలబడి గెలుపొందారు.29 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు.. 35 ఏళ్ల వయసులో పీసీసీ మెంబర్ అయ్యారు.ఎంపీగా మంత్రిగా జిల్లాలో ఎంతో పేరు సంపాదించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.కాని ఇలా కుమారుడి ఎదుగుదల చూసినా ఆయన, మే 23, 1998న తన ఫార్మ్ హౌస్ నుండి పులివెందులకు తిరిగి వెళ్తున్న సమయంలో ప్రత్యర్థి ముఠా జరిపిన బాంబు దాడిలో రాజారెడ్డి మరణించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation