Tuesday, July 27, 2021

ఏపీలో టెన్త్‌, ఇంట‌ర్ విద్యార్ధులకు త్వరలో గుడ్ న్యూస్..!

Must Read

దేశంలో వైరస్ మ‌హ‌మ్మారి కారణంగా టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ‌అన్ని రాష్ట్రాలు ర‌ద్దు చేసినా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మాత్రం రద్దు చెయ్యకుండా వాయిదా వేసింది. విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని ప‌రీక్ష‌లు తప్పకుండా నిర్వహిస్తామని ఇప్ప‌టికే ప‌లు సార్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై స్పందించిన మంత్రి.. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డానికి ఒక్క నిమిషం చాలు.. కానీ, ఆ త‌ర్వాత ప‌ర్యావ‌స‌నాల‌ను కూడా గుర్తించాల‌న్నారు.. ఇక‌, జులై మొద‌టి వారంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌న్న మంత్రి సురేష్‌.. జులై చివరి వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

కాగా, క‌రోనా వైరస్ అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంపై ప‌రీశీల‌న చేయ‌నున్న‌ట్టు గ‌తంలోనే ప‌లు సంద‌ర్భాల్లో మంత్రి ఆదిమూల‌పు సురేష్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This