Tuesday, July 27, 2021

20 నుంచి క‌ర్ఫ్యూలో స‌డ‌లింపులు.. జ‌గ‌న్‌ సంచలన నిర్ణ‌యం

Must Read

ఏపీలో క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ఫ్యూ . పాజిటివ్ కేసులు భారీగా తగ్గడంతో.. స‌డ‌లింపులు ఇస్తూ వ‌స్తున్నారు.. ఇక‌, గ‌తంలో ప్ర‌క‌టించిన క‌ర్ఫ్యూ తేదీ ముగుస్తున్న త‌రుణంలో.. కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్.. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళ‌లు స‌డ‌లిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు..

తాజా నిర్ణ‌యం ప్ర‌కారం.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ స‌డ‌లింపులు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.. ఈ నెల 20వ తేదీ త‌ర్వాత నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయి.. సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల‌ని.. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమ‌లు చేయాల‌న ఆదేశాలు జారీ చేసారు.

కేసులు అధికంగా వస్తున్న తూర్పు గోదావ‌రి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 2 గంటల వ‌ర‌కే స‌డ‌లింపులు అమ‌ల్లో ఉంటాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రెగ్యుల‌ర్ టైమింగ్స్ ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం జ‌గ‌న్.. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేయాల‌ని ఆదేశించారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This